ఆ మాట ఎక్కడా రాకూడదు: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Agriculture And Grain Collection | Sakshi
Sakshi News home page

CM YS Jagan Review Meeting: ఆ మాట ఎక్కడా రాకూడదు: సీఎం జగన్‌

Nov 7 2022 12:26 PM | Updated on Nov 7 2022 5:31 PM

CM YS Jagan Review Meeting On Agriculture And Grain Collection - Sakshi

వ్యవసాయ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహిచారు.

సాక్షి, తాడేపల్లి: వ్యవసాయ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహిచారు. ఈ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని, దీన్ని అధికారులు సవాల్‌గా తీసుకోవాలన్నారు.
చదవండి: రామోజీరావుపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంచలన ఆరోపణలు

‘‘ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నాం. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలి. ఇ-క్రాపింగ్‌ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో సేకరణ కొనసాగాలి. వ్యవసాయ శాఖతో పౌరసరఫాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. రబీకి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

ఎరువులు, విత్తనాలు, ఇలా అన్నిరకాలుగా రైతులకు కావాల్సివన్నీ సిద్ధం చేసుకోవాలన్న సీఎం.. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్‌ను ఉంచేలా కార్యాచరణ సిద్ధంచేయాలన్నారు.  వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లోనూ డ్రోన్స్ ఉండేలా చూడాలని సీఎం అన్నారు.

ప్లాంట్‌ డాక్టర్స్ కాన్సెప్ట్‌పై సీఎం సమీక్ష
భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి ఆర్బీకేలో ఉంచాలని సీఎం ఆదేశించారు. ఈ పరికరాలను అన్ని ఆర్బీకేలకు అందుబాటులో ఉంచాలన్నారు. మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలు కారణంగా ఏ ఎరువులు వాడాలి? ఎంతమేర వాడాలన్నదానిపై స్పష్టత వస్తుందన్న సీఎం.. దీని వల్ల పెట్టుబడి తగ్గుతుందని, దిగుబడులు కూడా పెరుగుతాయన్నారు. భూసారాన్ని కూడా పరిరక్షించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement