
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర రహదారి భద్రతా మండలి సమావేశంలో ‘ది ఎబిలిటీ పీపుల్’ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ దిలీప్ పాత్రో పాల్గొన్నారు. ప్రమాద బాధితులను ఆదుకోవడానికి, ప్రజల్లో చైతన్యం కలిగించడానికి తాను చేపడుతున్న కార్యక్రమాలను దిలీప్ పాత్రో ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించారు. అనంతరం దీనికి సంబంధించిన పోస్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేశారు.