తోడేళ్లంతా ఒక్కటయ్యాయి.. మీ బిడ్డ సింగిల్‌గానే నడుస్తున్నాడు: సీఎం జగన్‌

CM YS Jagan Political Punches CBN At Vinukonda Public Meeting - Sakshi

సాక్షి, పల్నాడు: గిట్టని వాళ్లు రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని దుష్ర్పచారం చేస్తున్నారు. కానీ, ఇప్పుడు ఏపీ దేశానికే దిక్సూచిగా నిలిచిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జగనన్న చేదోడు మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా వినుకొండ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌.. అక్కడి బహిరంగ సభ ద్వారా ప్రతిపక్షాలపై విమర్శలు సంధించారు. 

గతంలో గజదొంగల ముఠా ఏపీని దోచేశారు. సీఎంగా ఓ ముసలాయాన(చంద్రబాబును ఉద్దేశించి) ఉండేవాడు. ఓ గజ దొంగల ముఠా ఉండేది. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, దత్తపుత్రుడు వీళ్లంతా గతదొంగల ముఠా. మరి వీళ్లు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వలేదు?. ఎందుకంటే వాళ్ల విధానం డీపీటీ కాబట్టి. డీపీటీ అంటే దోచుకో, పంచుకో, తినుకో అని సీఎం జగన్‌ ప్రతిపక్షంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ఏం చేశాడో చూశారు కదా.  తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయి..  సింహంలా మీ బిడ్డ ఒక్కడే నడుస్తున్నాడు అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మీ  బిడ్డకు ఎలాంటి పొత్తుల్లేవు, మీ బిడ్డ వాళ్ల మీద, వీళ్ల మీద నిలబడడు. మీ బిడ్డ ఒక్కడే..  సింహాంలా ఒక్కడే నడుస్తాడు. తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదు. ఎందుకంటే మీ బిడ్డ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడు.

ఇది పేదవాడికి, పెత్తందారుకి మధ్య నడుస్తున్న యుద్ధం. మాట ఇస్తే నిలబడే వ్యక్తి ఒక వైపు ఉంటే, వెన్నుపోట్లు, మోసాలు చేసే తోడేళ్లు మరో వైపు ఉన్నారు. గజ దొంగల పాలన కావాలా? లంచాలు, అవినీతికి చోటు లేని పాలన కావాలా?. మీ అందరి చల్లటి దీవెనలతో నడుస్తున్నా. మీ బిడ్డకు ఉన్న నమ్మకం ఒక్కటే మీ అందరి ఆశీస్సులు, దేవుడి చల్లటి దీవెనలు ఉన్నాయి అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top