విద్యుత్‌ శాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు | CM YS Jagan Mohan Reddy Review On Electricity Department | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ శాఖపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Jul 28 2022 12:34 PM | Updated on Jul 28 2022 4:03 PM

CM YS Jagan Mohan Reddy Review On Electricity Department - Sakshi

వ్యవసాయ మెటార్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలంటే చెప్పాలని, దీనిపై రైతులకు లేఖలు రాయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

సాక్షి, తాడేపల్లి: థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలని, దీని కోసం సరైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో విద్యుత్‌ శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
చదవండి: వైఎస్సార్‌ కాపు నేస్తం; సీఎం జగన్‌ కా​కినాడ జిల్లా పర్యటన షెడ్యూల్‌ ఇదే.. 

‘‘విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్‌ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి. కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సప్లై జరిగేలా చూసుకోవాలి. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ మెటార్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలంటే చెప్పాలని, దీనిపై రైతులకు లేఖలు రాయాలని’’ సీఎం జగన్‌ ఆదేశించారు.

‘‘రైతుపై ఒక్కపైసాకూడా భారం పడదని, బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్నికూడా వారికి వివరించండి. శ్రీకాకుళంలో పైలట్‌ప్రాజెక్ట్‌ ఎలా విజయవంతం అయ్యిందో వివరించండి. రైతులకు జరిగిన మేలు కూడా వివరించండి. 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అక్కడ ఆదా అయిన విషయాన్ని రైతులకు వివరించాలి. మోటార్లకు మీటర్లు కారణంగా మోటార్లు కాలిపోవు, ఎంత కరెంటు కాలుతుందో తెలుస్తుంది, నాణ్యంగా విద్యుత్‌ సరఫరా ఉంటుందనే విషయాన్ని వారికి వివరించాలి. వ్యవసాయ పంపుసెట్లకోసం పెట్టుకున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేయాలి. ఎక్కడ ట్రాన్సాఫార్మర్‌ పాడైనా వెంటనే రీప్లేస్‌ చేయాలని సీఎం ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement