తుపాను పరిస్థితులపై సీఎం జగన్‌ ఆరా  | CM YS Jagan Inquired About The Storm Situation | Sakshi
Sakshi News home page

తుపాను పరిస్థితులపై సీఎం జగన్‌ ఆరా 

Sep 25 2021 10:32 PM | Updated on Sep 26 2021 7:30 AM

CM YS Jagan Inquired About The Storm Situation - Sakshi

తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కార్యాలయ అధికారులతో సమీక్షించారు.

సాక్షి, అమరావతి: తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కార్యాలయ అధికారులతో సమీక్షించారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని, తీసుకోవాల్సిన చర్యలపై వారికి తగిన సూచనలు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. గ్రామ సచివాలయాల వారీగా కంట్రోలు రూమ్స్‌ కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. (చదవండి: రెండేళ్ల పాలనకు నిదర్శనమే ఈ ప్రజా తీర్పు: మంత్రి బొత్స)

విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో విపత్తు నిర్వహణ సిబ్బందిని కూడా సిద్ధం చేశామన్నారు. అవసరమైన చోట శిబిరాలు తెరిచేందుకు కలెక్టర్లు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. తుపాను అనంతర పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తీరం దాటిన తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
చదవండి:
26న ‘గులాబ్‌’ తుఫాన్‌.. నేడు, రేపు భారీ వర్షాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement