Breadcrumb
Live Updates
CM YS Jagan: గుంటూరు, పల్నాడు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
కొండవీడులో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్
వ్యర్థాల నుంచి విద్యుచ్ఛక్తి
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామ రెవెన్యూ పరిధిలో రూ.345 కోట్లతో నిర్మించిన జిందాల్ పవర్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. గంటకు 15 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేసేలా దీనిని తీర్చిదిద్దారు. రోజుకు 1,600 టన్నుల చెత్తను ఉపయోగించే సామర్థ్యం ప్లాంట్‌కు ఉంది. మొత్తం తొమ్మిది నగరాల నుంచి చెత్తను సేకరించనున్నారు. ఇప్పటికే ప్లాంట్‌లో ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 1,200 టన్నుల చెత్త ప్లాంట్‌కు వస్తోంది. ప్లాంట్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కడి ఆవరణలో మొక్కలు నాటారు.
‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
పల్నాడు జిల్లా కొండవీడులో జిందాల్ ప్లాంటు సమీపంలో ఏర్పాటు చేసిన ‘జగనన్న హరిత నగరాలు’ నమూనాను సీఎం ఆవిష్కరించారు. అనంతరం జిందాల్ ‘వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్‌ను సీఎం ప్రారంభించారు.
కొండవీడు చేరుకున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొండవీడు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని, ఎంపీ అయోధ్య రామిరెడ్డి,ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, కలెక్టర్ ఎల్.శివశంకర్ స్వాగతం పలికారు.
ప్రతి అడుగులో రైతన్నకు అండగా ఉంటున్నాం: సీఎం జగన్
అంతకుముందు సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమం జరుగుతోంది. ప్రతి అడుగులో రైతన్నకు అండగా ఉంటున్నాం. ప్రతీ గ్రామంలో విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతీదశలో రైతుకు తోడుగా ఉండేలా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. ట్రాక్టర్లతో సహా వస్తువులను రైతులకు అందుబాటులో ఉంచాం.
రూ.2016 కోట్లతో ప్రతి ఆర్బీకే స్థాయిలో 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలను స్థాపించేందుకు శ్రీకారం చుట్టబోతున్నాం. 3,800 ఆర్బీకే స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు పంపిణీ చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో రైతులకు అరకొర ట్రాక్టర్లు ఇచ్చారు. గతంలో ట్రాక్టర్ల కొనుగోలులో స్కామ్‌లు జరిగాయి. ఇవాళ రైతు ఇష్టం మేరకే ట్రాక్టర్ల కొంటున్నామని సీఎం జగన్ అన్నారు.
రైతుల ఖాతాల్లోకి రూ.175కోట్ల సబ్సిడీ జమ
గుంటూరు జిల్లా చుట్టగుంట వద్ద వైఎస్సార్ యంత్ర సేవ పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మెగా మేళాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. రైతు గ్రూపులకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ కోత యంత్రాల పంపిణీతో పాటు5,262 రైతు గ్రూపు బ్యాంక్ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం బటన్ నొక్కి జమచేశారు.
వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం
పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు.
రైతన్నలకు అందించబోతున్న ట్రాక్టర్స్
పల్నాడు జిల్లా కొండవీడుకు సీఎం జగన్
మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లా కొండవీడుకు చేరుకుని జిందాల్ ప్లాంటు సమీపంలో ఏర్పాటు చేసిన ‘జగనన్న హరిత నగరాలు’ నమూనాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.05 గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
సీఎం పర్యటన సాగేదిలా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. 10.40కల్లా గుంటూరు చుట్టుగుంట సెంటర్లోని సభావేదికకు చేరుకుంటారు. డాక్టర్ వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్లను, హర్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభిస్తారు.
3 నెలలకు ఒకసారి పరిశీలన
తొలకరి ప్రారంభం నుంచి ఆగస్టు 12లోగా ఈ పనులు పూర్తి చేయాలని ఆయా మునిసిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. మొక్కలు నాటిన అనంతరం పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత పట్టణ స్థానిక సంస్థలకు అప్పగిస్తారు. అనంతరం ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్‌కు చెందిన క్వాలిటీ కంట్రోల్ బృందం 3 నెలలకు ఒకసారి పరిశీలించి.. మొక్కల సంరక్షణకు అవసరమైన సూచనలిస్తుంటుంది.
రూ.78.84 కోట్లతో పచ్చందం..
మొదటి విడతలో ఉన్న 45 యూఎల్బీల్లోని రోడ్లకు ఇరువైపులా, మధ్యనున్న మీడియన్స్‌లలో మొక్కలు నాటనున్నారు. ఆయా ప్రాంతాల్లోని మట్టి, వాతావరణం, నీటి వనరుల లభ్యత ఆధారంగా బతికే వివిధ జాతులకు చెందిన 54 రకాల మొక్కలను ఎంపిక చేసి పెంచనున్నారు. రహదారి వెడల్పును బట్టి ఐదు రకాలుగా విభజించి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పచ్చదనం, సుందరీకరణ పనులకు రూ.78.84 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.
వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ పైలాన్‌ను ఆవిష్కరించనున్న సీఎం జగన్
అనంతరం అక్కడే జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ పైలాన్‌ను కూడా సీఎం ఆవిష్కరిస్తారు. తొలి విడతలో 45 పట్టణ స్థానిక సంస్థలను(యూఎల్బీ) జగనన్న హరిత నగరాలు కార్యక్రమం కోసం ఎంపిక చేశారు. పచ్చదనం పెంపుతో పాటు వాల్ పెయింటింగ్ తదితర పనులు చేపట్టి.. ఉత్తమ విధానాలను అనుసరించిన 10 పట్టణాలు, నగరాలకు ‘గ్రీన్ సిటీ చాలెంజ్’ కింద రూ.కోటి చొప్పున రూ.10 కోట్లను బహుమతిగా ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖతో పాటు ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ సంస్థలు చేపట్టాయి.
జగనన్న హరిత నగరాలకు శ్రీకారం
సాక్షి,అమరావతి: రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలు పచ్చదనంతో కొత్త శోభను సంతరించుకోనున్నాయి. పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ప్రభుత్వం ‘జగనన్న హరిత నగరాలు’కు శ్రీకారం చుట్టింది. మంగళవారం పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడులో దీనికి సంబంధించిన నమూనాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించనున్నారు.
Related News By Category
Related News By Tags
-
వైఎస్ జగన్‌ని కలిసిన ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు బుధవారం (జనవరి 28) కలిశారు. మంగళగిరి నియోజకవర్గం చినకా...
-
మహిళలకు వేధింపులు.. సోషల్‌మీడియాలో షాకింగ్ వీడియోలు.. జంగిల్ రాజ్‌లా ఏపీ
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోందని.. ఇప్పటిదాకా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా? అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు....
-
అజిత్ పవార్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సా...
-
భగ్గుమన్న పొగాకు రైతులు
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద పొగాకు రైతులు భగ్గుమన్నారు. సిగరెట్లపై 70 శాతానికిపైగా పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని తక్షణమే ఉపసంహరింపచేయాలని ఆందోళన చేశారు. నెల్ల...
-
నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ నేతలతో ...


