మంచి ఆలోచనలు కావాలి.. సమస్యలకు పరిష్కారం చూపాలి: సీఎం జగన్‌

Cm Jagan Speech In G20 Summit 2023 At Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది తమ ఉద్దేశమని, మేం అధికారంలోకి వచ్చాక.. 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జీ–20 సదస్సు తొలి రోజు.. సీఎం జగన్‌ హాజరయ్యారు. అతిథులతో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు. అనంతరం వారితో సీఎం భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా జీ-20 రెండో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాన్ని ఉద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడుతూ, 22 లక్షల ఇళ్లు కడుతున్నాం. ఈ ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం ముమ్మరంగా చర్యలు చేపడుతోంది. దీనిపై సరైన చర్చలు జరిపి.. సస్టెయిన్‌బుల్‌ పద్ధతులను సూచించాలని కోరుతున్నానని సీఎం జగన్‌ అన్నారు.

‘‘దీనిపై సరైన మార్గ నిర్దేశకత్వం అవసరం. దీనివల్ల మంచి ఇళ్లు పేదలకు సమకూరుతాయి. దీనిపై మీ నుంచి మంచి ఆలోచనలు కావాలి. సమస్యలకు మంచి పరిష్కారాలు చూపగలగాలి. ఈ అంశంపై మీరు చక్కటి చర్చలు చేయాలి. మీరు ఇక్కడ గడిపే సమయం చెరిగిపోలేని జ్ఞాపకంగా ఉంటుందని ఆశిస్తున్నాను’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: ‘కదులుతున్న ‘మార్గదర్శి’ అక్రమాల డొంక.. రామోజీ బెంబేలు’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top