నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

CM Jagan Attends MLA Baddukonda Appala Naidu Son Wedding at Vizag - Sakshi

సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లా నెలిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పెద్దకుమారుడి వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. భీమునిపట్నం మండలం దాకమర్రిలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు మణిదీప్‌- స్నేహలను ఆశీర్వదించారు. జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం జగన్‌ దీవించారు. 

పర్యటనలో సీఎం జగన్‌ వెంట ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయ కర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌.. పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top