TDP Leaders Clash: టీడీపీలో వర్గపోరు.. బుచ్చయ చౌదరి ఎదుటే బాహాబాహీ!

సాక్షి, తూర్పుగోదావరి: కొవ్వూరు టీడీపీలో మరోసారి వర్గ విబేధాలు బయటపడ్డాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది.
అయితే, టీడీపీ ఏర్పాటు చేసిన సభలో బుచ్చయ్య చౌదరి ఎదుటే జవహర్ అనుకూల, వ్యతిరేక వర్గాలు బాహాబాహికి దిగాయి. కాగా, రెండు వర్గాల ఆందోళనలతో సమావేశం అర్థాంతరంగానే ముగిసింది. ఈ ఘటనతో బుచ్చయ్య చౌదరి అసహనం చెందినట్టు సమాచారం. ఇక, ఈ నియోజకవర్గానికి జవహర్ వచ్చిన ప్రతీసారి వ్యతిరేక వర్గం అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది.