తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ | Cji Dy Chandrchud Tirupati Visit Updates | Sakshi
Sakshi News home page

తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ చంద్రచూడ్‌

Sep 28 2024 8:00 PM | Updated on Sep 28 2024 8:41 PM

Cji Dy Chandrchud Tirupati Visit Updates

సాక్షి,తిరుపతి:తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ డి.వై చంద్రచూడ్ శనివారం(సెప్టెంబర్‌28) దర్శించుకున్నారు.సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ డాక్టర్ డీవై చంద్రచూడ్‌కు టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు స్వాగతం పలికారు.

ఆల‌య అర్చకులు బాబు స్వామి, మణికంఠ స్వామి, శ్రీనివాస ఆచార్యులు సాంప్ర‌దాయ‌బ‌ద్ధంగా సీజేఐకి స్వాగతం పలికారు.అమ్మవారి దర్శనం అనంతరం చీఫ్ జస్టిస్‌ దంపతులకు వేద‌ పండితులు వేదశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement