‘చంద్రబాబుకు ప్రైవేటు పిచ్చి పట్టుకుంది’ | CITU Narsinga Rao Serious Comments On CBN | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుకు ప్రైవేటు పిచ్చి పట్టుకుంది’

Dec 30 2024 10:17 AM | Updated on Dec 30 2024 11:51 AM

CITU Narsinga Rao Serious Comments On CBN

సాక్షి, విశాఖపట్నం: ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రైవేటు పిచ్చి పట్టుకుందని ఆరోపించారు సీఐటీయూ నేత నరసింగరావు. ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎం రమేష్‌, భరత్‌కు ఎంపీలుగా కొనసాగే అర్హత లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సీఐటీయూ నేత సీహెచ్ నరసింగరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టడం చంద్రబాబు ప్రైవేట్ పిచ్చికి నిదర్శనం. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దెబ్బ తీయడం కోసం ఆర్సిలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ తీసుకువస్తున్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌కు గనులు కావాలని అడుగుతున్న చంద్రబాబు.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు ఎందుకు అడగడం లేదు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కడపలో స్టీల్ ప్లాంట్ పూర్తి చేయాలి.

చంద్రబాబు ప్రైవేట్ పిచ్చితో వ్యవహరిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా 8వ తేదీన నిరసన కార్యక్రమం ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కూటమి ఎంపీలు సీఎం రమేష్, భరత్ తీరని ద్రోహం చేస్తున్నారు. ఎంపీలు ఇద్దరూ వెంటనే రాజీనామాలు చేయాలి. వారికి ఎంపీలుగా కొనసాగే అర్హత లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement