ఆయనకూ నేనే సమయం ఇవ్వాలి
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అనపర్తి : ‘చంద్రబాబు ఎవరు? చంద్రబాబుకు కూడా సమయం ఇవ్వాల్సింది నేనే’.. అంటూ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
చంద్రబాబునాయుడు తనకు సమయం కేటాయిస్తే శాసనసభ సమావేశాలకు రావడానికి సిద్ధమని జగన్ అంటున్నారని విలేకర్లు ప్రశ్నించగా.. అయ్యన్న పైవిధంగా వ్యాఖ్యానించారు. జగన్ అసెంబ్లీకి ఎందుకు రావడంలేదంటూ చాలా మంది తనను ప్రశి్నస్తున్నారని, ఆయన రాకపోతే తనకేం సంబంధమని అసహనం వ్యక్తంచేశారు. జగన్‌మోహనరెడ్డి కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, సాధారణ ఎమ్మెల్యేలకు ఇచి్చనట్లుగానే ఆయనకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పారు.


