బలహీన వర్గాల జీవితాల్లో పెను మార్పులు: చెల్లుబోయిన

Chelluboina Venu Gopala Krishna Attend Jyothibapu Phule Vardanthi - Sakshi

సాక్షి, విజయవాడ: మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నెరవేరుస్తూ బలహీనవర్గాలకి అండగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి‌ కళాక్షేత్రంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులతో‌ కలిసి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పూల మాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన  మీడియాతో మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాలకి ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలె అని గుర్తు చేశారు. పూలే ఆశయాలని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని సీఎం వైఎస్ జగన్ బలహీనవర్గాలని బ్యాక్‌బోన్‌గా చూస్తున్నారని తెలిపారు. ఎన్నో సంక్షేమ‌ పధకాలతో బలహీన వర్గాలకి అండదండగా నిలబడిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమన్నారు. చదవండి: మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

బలహీనవర్గాలకి 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని‌ కొనియాడారు. ఇంగ్లీష్ మీడియం, అమ్మ‌ఒడి లాంటి సంక్షేమ పధకాలతో సీఎం వైఎస్ జగన్ బలహీనవర్గాల జీవితాలలో పెను మార్పులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. మహిళలకి 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా సీంఎ జగన్‌ బీసీ మహిళల జీవితాలలో వెలుగులు నింపారన్నారని తెలిపారు. విద్యకి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం ద్వారా బీసీలు ఉన్నత చదువులు అభ్యసించడానికి అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడిన సీఎం జగన్ మంత్రివర్గంలో పనిచేయడం మా అదృష్టమని తెలిపారు. బలహీనవర్గాలకి అండగావుంటున్న తమ ప్రభుత్వానికి మహాత్మా జ్యోతిరావు పూలె ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top