బాబు సర్కారు మరో భారీ అప్పు | Chandrababu Govt Takes Another Rs 6,500 crore Debt | Sakshi
Sakshi News home page

బాబు సర్కారు మరో భారీ అప్పు

Oct 22 2026 10:15 AM | Updated on Oct 22 2026 10:15 AM

Chandrababu Govt Takes Another Rs 6,500 crore Debt

మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.6,500 కోట్ల రుణం 

వర్కింగ్‌ క్యాపిటల్‌ కోసం తీసుకునేందుకు అనుమతి 

ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదంఉత్తర్వులు జారీ 

దీంతో మార్క్‌ఫెడ్‌ ద్వారా చేసిన మొత్తం అప్పు రూ.28,500 కోట్లు  

సాక్షి, అమరావతి: బడ్జెట్‌ బయట ప్రభుత్వ గ్యారెంటీలతో అప్పుల పరంపరను చంద్రబాబు సర్కారు యథేచ్ఛగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా మరో భారీ రుణానికి అనుమతించింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.6,500 కోట్లు అప్పు చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణంగా తీసుకునేందుకు, దీనికి ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.  జాతీయ కో–ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి మార్క్‌ఫెడ్‌ ఈ రుణం పొందుతుందని అందులో తెలిపారు. రుణ కాలపరిమితి మొత్తానికి ప్రభుత్వ గ్యారెంటీ వర్తిస్తుంది.

 అలాగే.. అసలు, వడ్డీ మొత్తాలకు గ్యారెంటీ వర్తిస్తుందని.. అసలు, వడ్డీ చెల్లింపుల షెడ్యూల్‌ను సమర్పించడంతో పాటు వడ్డీ రేటు, కాలపరిమితి, మారటోరియం కాలం వంటి వివరాలను, ఇతర ఏవైనా నిబంధనలు ఉంటే వాటిని కూడా మార్క్‌ఫెడ్‌ తెలియజేయాలి. అయితే, మార్క్‌ఫెడ్‌ తన సొంత వనరుల నుండే రుణాన్ని చెల్లించాలి. అప్పు తీర్చడంలో మార్క్‌ఫెడ్‌ విఫలమైనప్పుడు మాత్రమే ప్రభుత్వ హామీ అమలులోకి వస్తుంది. గ్యారెంటీ ఇచ్చిన మొత్తంపై మార్క్‌ఫెడ్‌ ఐదు శాతం గ్యారెంటీ కమీషన్‌ను చెల్లించాలి. ఇదిలా ఉంటే.. మార్క్‌ఫెడ్‌ ద్వారా చంద్రబాబు సర్కారు ఇప్పటికే రూ.22,000 కోట్లు అప్పుచేసింది. తాజాగా చేసే రూ.6,500 కోట్ల అప్పుతో మార్క్‌ఫెడ్‌ ద్వారా చేసిన అప్పు రూ.28,500 కోట్లకు చేరింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement