నగరి: స్వచ్చ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. అసలు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌లో పని జరగడం లేదంటూ తేల్చేశారు చంద్రబాబు. పట్టాభి అన్నీ కథలే చెబుతారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టాభి బయట ఇచ్చే స్టేట్‌మెంట్ వేరు.. లోపల మాట్లాడే మాటలు వేరంటూ చురకలంటించారు. ఉపన్యాసాలు అందరూ ఇస్తారని పట్టాభి పనితీరుపై తప్పుబట్టారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు వెళ్లిన చంద్రబాబు.. స్వచ్చ ఆంధ్ర కార్పోరేషన్‌లో పని జరగడం లేదనే విషయాన్ని కుండబద్ధలు కొట్టారు.
ఇదిలా ఉంచితే, స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరిలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఆ సభ జనాలు లేక వెలవెలబోయింది. టీడీపీ పెద్దలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ సభ కాస్తా జనాలు లేకపోవడంతో బోసిపోయింది.
సభా ప్రాంగణంలో జనాలు లేక కుర్చీలు ఖాళీగా దర్శనం ఇచ్చాయి. భారీ అంచనాల నడుమ ఏర్పాటు చేసిన చంద్రబాబు సభను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. సీఎం చంద్రబాబు సభకు ప్రజలు ముఖం చాటేయడంతో టీడీపీ పెద్దలు కంగుతిన్నారు.

ఇది కూడా చదవండి:


