ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో హోదా లేని వ్యక్తుల నియామకం
మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఏఎస్ పోస్టులో పంచాయతీరాజ్ అధికారి
వివాదాస్పద వ్యక్తికి వక్ఫ్ బోర్డు సీఈవో పదవి అప్పగింత
ఉర్దూ అకాడమీకి చైర్మన్, సభ్యుల నియామకం లేదు
సంక్షేమం, అభివృద్ధికి ముస్లింలను ఆమడ దూరం పెట్టేసిన వైనం
ఎన్నికల హామీలను అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం
వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో ముస్లింలకు స్వర్ణ యుగం
నేడు విజయవాడ తుమ్మలపల్లిలో మైనార్టీ దినోత్సవం
సాక్షి, అమరావతి: ఎన్నికల హామీలను ఒక్కటైనా సక్రమంగా నెరవేర్చలేదు... సంక్షేమ పథకాల అమలులో తీవ్ర వైఫల్యం... శాఖాపరమైన పోస్టింగుల్లో ఇష్టారాజ్యం... ముస్లిం మైనార్టీల పట్ల పూర్తి ఉదాసీనత...! ఇదీ చంద్రబాబు ప్రభుత్వం తీరు. మొత్తం పరిస్థితి ఇలా ఉండగా మంగళవారం విజయవాడ తమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం జాతీయ మైనార్టీ దినోత్సవం నిర్వహించనుండడంపై ముస్లింలు మండిపడుతున్నారు. 12 హామీలు ఇచ్చి ఒక్కటీ సక్రమంగా అమలు చేయని బాబు... వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు పలికి ముస్లిం మైనారిటీలను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. వక్ఫ్ ఆస్తులను లీజు పేరుతో అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలకు తెరలేపారు. ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనాలు ఏడాదిగా బకాయిపెట్టారు.
49,218 మందికి రూ.326 కోట్ల సబ్సిడీ రుణాలిస్తామంటూ ప్రకటించి ఒక్కరంటే ఒక్కరికీ రుణం ఇవ్వలేదు. మరోవైపు బాధ్యతాయుత పోస్టుల్లో సైతం తగిన హోదా లేని వ్యక్తుల నియామకం, క్యాడర్ పోస్టుల్లో నాన్ కేడర్ వ్యక్తులకు బాధ్యతలు అప్పగించి మైనార్టీ సంక్షేమ శాఖను నిర్వీర్యం చేస్తోంది. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో పైరవీలు చేసుకుని వస్తున్న నాన్ కేడర్ ఉద్యోగులు క్యాడర్ పోస్టుల్లో ‘అధికార’ దర్పం చెలాయిస్తున్నారు. క్యాడర్ స్థాయి అధికారులైతే తాము చెప్పినట్టు వినరని భావించి ఏరికోరి అనర్హులను అందలం ఎక్కిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పుడే కాదు, 2014 ఎన్నికల సమయంలోనూ ముస్లింలకు చంద్రబాబు 25 హామీలిచ్చి ఎగ్గొట్టారు. నాలుగేళ్ల పాటు మంత్రివర్గంలో ముస్లింలకు చోటే కల్పించలేదు. గుంటూరు, కర్నూలులో ముస్లిం యువతపై దేశద్రోహం అక్రమ కేసులు పెట్టి వేధించారు.
వైఎస్ జగన్ పాలన స్వర్ణయుగం
4 శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ముస్లిం యువత ఉన్నత విద్యను ప్రోత్సహించారు దివంగత మహా నేత వైఎస్సార్. తండ్రి కంటే రెండు అడుగులు ముందుకేసిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ముస్లింలను ఆరి్థక, రాజకీయ, సామాజికంగా ముందుకు నడిపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల కింద మైనారిటీలకు డీబీటీ ద్వారా రూ.13,239.49 కోట్లు నేరుగా వారి ఖాతాలకే జమ చేశారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, జగనన్న తోడు వంటి కార్యక్రమాల (నాన్ డీబీటీ)ద్వారా మరో రూ.11,064.88 కోట్ల లబ్ధి చేకూర్చారు. మౌజమ్‌లు, ఇమామ్‌లకు గత చంద్రబాబు ప్రభుత్వం గౌరవ వేతనంగా రూ.3 వేలు, రూ.5 వేలు మాత్రమే ఇవ్వగా, వైఎస్ జగన్ హామీ మేరకు రూ.5 వేలు, రూ.10 వేలకు పెంచారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.300.68 కోట్లను గౌరవ వేతనంగా అందించింది. వారికి భరోసా ఇచ్చేలా వన్‌టైమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్సీ ఇచి్చంది. తెల్లకార్డుదారులకు స్పెషల్ కోవిడ్ అసిస్టెన్సీగా సుమారు రూ.100 కోట్లు అందించింది. 2019 ఎన్నికల్లో ముస్లింలకు 5 సీట్లు, 4 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా, ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. నామినేటెడ్, స్థానిక సంస్థల పదవుల్లోనూ ప్రాధాన్యం కల్పించారు. పాదయాత్రలో ఇచి్చన మాటను నిలబెట్టుకుంటూ అక్రమ కేసులను ఎత్తివేశారు.
నియామకాల్లో బాబు సర్కారు ఇష్టారాజ్యం
⇒ ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా ఐఏఎస్ అధికారిని నియమించాలి. కానీ, పంచాయతీరాజ్‌శాఖ నుంచి నాన్ క్యాడర్ అధికారి యాకుబ్ బాషాను నియమించారు.
⇒ అత్యంత కీలకమైన రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా సీహెచ్ శ్రీధర్ ఒక్కరే ఉన్నారు. ఏపీ హజ్ కమిటీ ఈవోగా ఉన్న గౌస్ పీర్‌కు ఉర్దూ అకాడమీ డైరెక్టర్, నూర్‌బాషా ఫెడరేషన్ ఎండీ పోస్టులు కట్టబెట్టారు. అంటే, ఒకే
వ్యక్తికి ఏకంగా రెండు, మూడు బాధ్యతలు అన్నమాట.
⇒వక్ఫ్ బోర్డు సీఈవో మహ్మద్ అలీ సర్విస్ రికార్డుల్లో ఇంటర్ విద్యార్హత మాత్రమే ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. పదోన్నతిపై సామాజిక మాధ్యమాల్లో న్యాయవాదులు పోస్టులు పెట్టారు. ఈయన బంధువులు 13 మందికి పైగా వక్ఫ్‌బోర్డులో కీలక స్థానాల్లో ఉన్నారు. అలీ హైదరాబాద్‌లో వక్ఫ్ బోర్డు స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైంది. తర్వాత ఆ భూమికి లీజు ఖరారు చేసుకున్నట్టు
తెలిసింది.
⇒ రాజ్యాంగబద్ధమైన మైనార్టీ కమిషన్ కార్యదర్శి పోస్టుకు ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన వ్యక్తిని నియమించాల్సి ఉంది. కానీ, తగిన అర్హత లేని నిజాముద్దీన్‌కు బాధ్యతలు అప్పగించారు. కమిషన్‌కు చైర్మన్‌ను లేకపోవడంతో వైస్ చైర్మన్ జాషువా డానియేల్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రస్తుతం కమిషన్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. ఉర్దూ అకాడమీకి చైర్మన్, పాలక వర్గాన్ని కూడా నియమించకపోవడం గమనార్హం.
జగన్ చేసి చూపించారు..
వైఎస్ జగన్ మాట ఇస్తే చేసి చూపిస్తారని ప్రజల్లో నమ్మకం పెంచుకున్నారు. సామాజికంగా, ఆరి్థకంగా, రాజకీయంగా ముస్లింలను ప్రోత్సహించారు. శాశ్వత జీవనోపాధి చూపించేలా అనేక పథకాలతో మైనార్టీ లకు జగన్ మేలు చేశారు.
–మీర్జా షంషీర్ అలీబేగ్, మాజీ చైర్మన్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్
ముస్లింలను ఎంతకాలం మోసం చేస్తారు బాబూ..?
రాష్ట్రంలోని ముస్లిం సమాజాన్ని ఎంతకాలం మోసం చేస్తారు చంద్ర బాబూ..? 2024లో హజ్ యాత్రీకులకు జగన్ నిధులు మంజూరు చేయగా, తర్వాత
వచి్చన చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేదు. రూ.లక్ష చొప్పున ఇస్తామని ఆ తర్వాత విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లే వారికే అని మోసం చేశారు. హజ్ కమిటీలో ఇస్లామిక్ ధారి్మక పండితుల స్థానంలో టీడీపీ కార్యకర్తలు పఠాన్ ఖాదర్‌ఖాన్, షేక్ హసన్‌బాషాలను నియమించారు.
–షేక్ గౌస్ లాజమ్, ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్
మైనార్టీ దినోత్సవం జరిపే నైతిక హక్కులేదు..
మైనార్టీలకు ఏ మాత్రం మేలు చేయని అసమర్థ చంద్రబాబు ప్రభుత్వానికి మైనార్టీ జాతీయ దినోత్సవాన్ని జరిపే నైతిక హక్కులేదు. బాబు అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరిస్తారు. –షేక్ నాగుల్ మీరా, రాష్ట్ర అధ్యక్షులు, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి
వైఎస్ జగన్ మేలును ముస్లిం సమాజం మరువదు
వైఎస్ జగన్ చేసిన మేలును ముస్లిం సమాజం ఎప్పటికీ మరువదు. నూర్ బాషా, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్లిస్తానని 2014, 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఇచి్చన హామీ నిలబెట్టుకోలేదు. నామినేటెడ్ పదవుల్లోనూ అన్యాయం చేశారు. –షేక్ దస్తగిరి, అధ్యక్షుడు, ఏపీ ముస్లిం దూదేకుల జేఏసీ


