Dec 10th: చంద్రబాబు కేసు అప్‌డేట్స్‌

Chandrababu Case Petitions And Political Updates 10th December - Sakshi

బాబుకు సంబంధించి ఏ కేసునయినా 17aకు  ముడిపెట్టే ప్రయత్నం

తప్పు చేయలేదని కోర్టుకు ఇప్పటివరకు ఎక్కడా చెప్పని చంద్రబాబు

తనను అరెస్ట్‌ చేయడానికి గవర్నర్‌ అనుమతి తీసుకోలేదంటూ పిటిషన్లు

కోర్టులో ఒకలా, ప్రజల మధ్యలో మరోలా చంద్రబాబు వాదనలు

పవన్‌కు సూటి ప్రశ్నలు..

Chandrababu Cases, Political Updates..

4:18PM, Dec 10, 2023

లోకేష్ పేరు ఎత్తితేనే బెంబేలెత్తుతోన్న ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు

లోకేష్ యువగళం పాదయాత్రపై టీడీపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి

యువగళం పాదయాత్ర తమ నియోజకవర్గాల్లో వద్దే వద్దుంటున్న నేతలు

నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పాదయాత్ర రద్దు

పార్టీ వైఖరిపై అయ్యన్న కినుక

చేతులెత్తేసిన చోడవరం, మాడుగుల నేతలు

చేసేదిలేక రూట్ మ్యాప్‌ మార్పు....!!

షెడ్యూల్ ప్రకారం పాదయాత్ర

ఉమ్మడి విశాఖ జిల్లాలో పాయకరావు పేట నుంచి

కోటవురట్ల మీదుగా నర్సీపట్నం, చోడవరం, మాడుగుల

అనకాపల్లి, పరవాడ, గాజువాక చేరుకుని నగరంలోకి ప్రవేశించి

పెందుర్తి మీదుగా భీమిలి చేరుకోవాలి

కానీ.. టీడీపీ నేతల అసంతృప్తితో షెడ్యూల్ మార్చారు

తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం

11న పాయకరావు పేటలో ప్రవేశించి యలమంచిలి, అనకాపల్లి, పరవాడ, గాజువాక మీదుగా నగరంలోకి ప్రవేశించి 

ఈ నెల 20 లేదా 21న భీమిలిలో ముగించాలని నిర్ణయించారు

ఇందులో నర్సీపట్నం, చోడవరం మాడుగులలను తీసేశారు

చంద్రబాబుపై అయ్యన్నపాత్రుడు

తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం

తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ టికెట్ ఓకే చేయకపోవడం..

గంటాకు ప్రాధాన్య ఇవ్వడం..

గంటా అనకాపల్లి ఎంపీ టికెట్ కోసం..ఓ NRIను వెతుకుతుండటం

అయ్యన్నకు ఏమాత్రం నచ్చడంలేదని టీడీపీ క్యాడర్ చెప్పుకుంటున్నారు

డబ్బులు దండగా జనాలు రాకపోవడంతో పాదయాత్ర వద్దు బాబోయే అని టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు

3:20PM, Dec 10, 2023

 • టికెట్ల పేరుతో కార్యకర్తలతో ఆటాడుకుంటున్న చంద్రబాబు
 • తేల్చుడు కాదు అంతా నాన్చుడు మంత్రమే
 • పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో సీటు పంచాయితీ
 • విజయవాడ : వెస్ట్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్న బుద్ధా వెంకన్న 
 • బీసీ అభ్యర్థిగా చంద్రబాబు తనకే సీటు ఇస్తారన్న బుద్ధా
 • టీడీపీ సీటు ఎంఎస్ బేగ్కు ఇప్పిస్తానన్న కేశినేని నాని
 • కేశినేని చిన్ని వర్గంలో బుద్ధా వెంకన్న, కేశినేని నాని వర్గంలో ఉన్న ఎంఎస్ బేగ్ 
 • కేశినేని బ్రదర్స్ మధ్య ఆధిపత్యంతో సీటు పై ఎటూ తేల్చకుండా పెండింగ్లో పెట్టిన చంద్రబాబు 
 • ఇప్పుడు ఖరారు చేసిన జనసేనకి ఇవ్వాల్సి వస్తే మళ్లీ వెన్నుపోటు తప్పదు అంటున్న తమ్ముళ్లు

3:18PM, Dec 10, 2023

ఏపీ ఎన్నికలకు 4 నెలల ముందే..
సీఎం రేస్‌ నుంచి పవన్ కల్యాణ్ అవుట్..!!

నమ్ముకున్న వాళ్లను..
తడిగుడ్డతో గొంతు ఎలా కోయాలో..
పవన్ కల్యాణ్‌కు తెలిసినంతగామరెవ్వరికీ తెలియదు.

జనసేన పుట్టినప్పటి నుంచి..
ఇప్పటి వరకూ జనసేన జెండా మోసిన వాళ్లను తన స్వార్ధ రాజకీయాల కోసం
పవన్ కల్యాణ్‌ మోసం చేస్తూనే ఉన్నాడు.

పవన్ కల్యాణ్‌ను దగ్గరుండి చూసిన..
ఆయన మనస్తత్వాన్ని బాగా తెలిసిన వాళ్లు..
ఆయనను వదిలేసి వారి దారి వారు చూసుకున్నారు.

పవన్ కల్యాణ్‌ను నడిపించేది..
చంద్రబాబేనని..
జనసేన పుట్టిందే చంద్రబాబు కోసమని..
తెలిసిన వాళ్లు జనసేన ఆఫీస్ దరిదాపుల్లోకి ..
కూడా వెళ్లడం లేదు.

జనసేన ఆఫీస్‌లో దశాబ్దం పాటు ..
పని చేసిన సందీప్‌, 
మెగా ఫ్యామిలీ కోసం ఎంతో కృషి చేసిన..
ఆయన తల్లి పద్మావతి కూడా..
జనసేనను వదిలేసి వచ్చారంటేనే..
పవన్ కల్యాణ్ విపరీతమైన మనస్తత్వాన్ని..
అర్ధం చేసుకోవచ్చు.

తెలంగాణ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేస్తే..
జనసేనకు ఒక్క చోట కూడా..
డిపాజిట్ రాలేదు.
కొల్లాపూర్‌లో బర్రెలక్కకు
5,700 వస్తే...జనసేన అభ్యర్ధులకు..
ఒక్క కూకట్‌పల్లిలో మినహా..
మిగిలిన 7 చోట్ల 3 వేల ఓట్లు కూడా దాటలేదు.

తెలంగాణ ఎన్నికల తరువాత..
చంద్రబాబు - పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు.
భేటీ తరువాత పవన్ మాటలు చూస్తుంటే..
ఆయనే తాను సీఎం రేస్‌లో లేనట్లేనని..
ప్రకటించినట్లుంది.

టీడీపీ తనకు సీఎం పదవి..
కేటాయించే పరిస్థితి లేనట్లు
జనసేన శ్రేణులకు పవన్ సంకేతాలు.

టీడీపీ అభ్యర్ధులను..
జనసేన క్యాడర్‌ గెలిపించాలట.!!
అప్పుడే ఈయనకు సీఎం ఛాన్స్ అట..!!

బుర్ర ఉన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడుతాడా..?
ఈ మాటలు జనసేన క్యాడర్‌ నమ్మితే..
అంతకంటే తిక్కలి వాళ్లు..
పిచ్చి వాళ్లులేనట్లే..!!

టీడీపీ అత్యధిక సీట్లు తీసుకుని..
అత్యధిక సీట్లు గెలిస్తే..
పవన్‌ను అసలు పట్టించుకుంటారా..?
ఇంట్లో చెత్త బుట్టను చూసినట్లు చూస్తారు..!!

తొలి నుంచి పవన్‌ మాటలు..
చిత్రవిచిత్రమైన మాటలే..!

ఒకసారి సీఎం రేసులో ఉన్నాను అంటాడు..
ఒకసారి సీఎం రేసులో లేనంటాడు..
మరోసారి రెండు చోట్ల ఓడించారు..
సీఎం పదవికి అర్హుడునేనా అంటాడు..!

పవన్‌ను నమ్ముకుంటే..
జనసేన శ్రేణులు, కాపులు నట్టేట మునిగినట్లే..
ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలను గ్రహించాలి.

 

2:21 PM, Dec 10, 2023
ముందు నుయ్యి వెనక గొయ్యి

 • తెలియని రాజకీయాలతో ఇరకాటంలో పడ్డ పవన్ కళ్యాణ్
 • తెలంగాణ ఎన్నికల కోసం బీజేపీతో చెట్టాపట్టాల్
 • ఏపీ కోసం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పవన్ కళ్యాణ్
 • కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చే బీజేపీని ఇప్పుడు ఎలా వదులుకోవాలంటున్న పవన్ కళ్యాణ్
 • చంద్రబాబును ఇప్పుడు నమ్మి తర్వాత తానెందుకు ఇబ్బందులు పడాలన్న యోచనలో పవన్ కళ్యాణ్
 • తెలుగుదేశం ఇచ్చే పాతిక సీట్లతో జనసేన ను ఎలా సంతృప్తి పరచాలన్న ఆందోళనలో పవన్ కళ్యాణ్

2:18 PM, Dec 10, 2023
పవన్‌కు వెన్నుపోటుకు బాబు రెడీ

 • సీట్ల పంపకంపై ఇటీవల పవన్ కళ్యాణ్ తో చర్చించిన చంద్రబాబు
 • బీజేపీతో ఇక పెంచుకోవడమే మేలని పవన్ కళ్యాణ్ కు సూచించిన చంద్రబాబు
 • బీజేపీని వదులుకొని ముందుకొస్తే పవన్ కళ్యాణ్ కి పాతిక సీట్లు ఇస్తానన్న చంద్రబాబు
 • తన అరెస్టుకు ముందు ఇప్పటికీ పరిస్థితి మారిందంటున్న చంద్రబాబు
 • బీజేపీ బదులు కాంగ్రెస్ కమ్యూనిస్టులను కలుపుకుందామని పవన్ కి చెబుతున్న బాబు
 • జనసేన తరపున పోటీ చేసే నాయకులు ఎవరో తనకు ముందే చెప్పాలని సూచన
 • తన సర్వే ప్రకారమే జనసేన లో ఎవరిని నిలబెట్టాలో చెప్తా అంటున్న చంద్రబాబు
 • అభ్యర్థుల ఖరారు విషయంలో తనదే తుది నిర్ణయం అని చెబుతున్న చంద్రబాబు
 • తాను చెప్పినట్టు వింటేనే పొత్తు, లేదంటే మరో దారి చూసుకుంటానంటున్న చంద్రబాబు

12:30 PM, Dec 10, 2023
విపత్తుపై చంద్రబాబు నీచ రాజకీయాలు: మంత్రి కాకాణి

 • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు
 • విపత్తు సమయంలో ఏ నేత అయినా ప్రజలకు అండగా నిలవాలి
 • కానీ చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు
 • విపత్తు సమయంలో టీడీపీ నేతలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు
 • టీడీపీ నేతలు కేవలం ప్రెస్‌మీట్లకు మాత్రమే పరిమితమయ్యారు
 • 14 ఏళ్లలో వ్యవసాయానికి చంద్రబాబు తీసుకున్న చర్యలు ఏంటి?
 • రైతులను చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదు
 • వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు
 • రైతులను అవమానకరంగా మాట్లాడింది చంద్రబాబే
 • వ్యవసాయాన్ని కించపరిచేలా మాట్లాడింది చంద్రబాబే
 • చంద్రబాబు కూతలు కూస్తుంటే రామోజీ రాతలు రాస్తున్నారు
 • విపత్తుసమయంలో రైతులకు చంద్రబాబు ఇచ్చిందేమిటి?
 • విపత్తు కాలంలో రైతాంగానికి అన్ని విధాలా అండగా నిలిచాం
 • విపత్తుల సమయంలో ప్రజలకు మా ప్రభుత్వం అండగా నిలిచింది.

11:30 AM, Dec 10, 2023
బుద్ద వెంకన్న ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలవా? 

 • తెలంగాణలో అసలు మీ పార్టీ ఎందుకు పోటీ చేయలేదు? 
 • ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క సీటు కూడా రాదని మీకు ముందే అర్థమైందా? 
 • లేక కాంగ్రెస్ పార్టీకి బాగా ప్రోత్సాహం ఇవ్వాలని డిసైడ్ అయ్యారా? 
 • తెలంగాణలో అన్ని సీట్లలో పోటీ చేస్తామని బాలకృష్ణతో ప్రకటనలు ఎందుకు ఇప్పించారు? 
 • చివరికి మీ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు కూడా మీరు వెన్నుపోటు పొడిచారా? 
 • ఎంత ప్యాకేజీకి తెలుగుదేశం పార్టీని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారు? 
 • ఇన్నాళ్లు పోటీ చేసిన మీకు కూడా వెన్నుపోటు తప్పదని మీరు అనుమానిస్తున్నారా? 
 • మీకు టికెట్ ఇవ్వకపోతే ఆప్షన్ బీ కూడా ఉందా? 
 • చంద్రబాబు, లోకేష్‌లను బెదిరిస్తున్నారా? లేక మీ బాధ చెప్పుకుంటున్నారా?
 • తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం చేసుకోలేదు
 • తెలంగాణ ఎన్నికలతో చంద్రబాబుకు ఏం సంబంధం?
 • నాకు టికెట్ ఇవ్వకపోతే ఆప్షన్ బీ కూడా ఉంది
 • విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తా.. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న 

7:20 AM, Dec 10, 2023
పచ్చ బ్యాచ్‌ అప్పుడలా.. ఇప్పుడిలా..
పచ్చ పిచ్చికి మందులు కూడా పనిచేయడం లేదుగా..
కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా?

నారా లోకేష్‌కు స్ట్రాంగ్‌ కౌంటర్‌..

7:15 AM, Dec 10, 2023
స్కిల్‌ కేసు ఎక్కడికి దారి తీస్తుంది?

 • స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ జనవరి19కి వాయిదా
 • 17ఏ వ్యవహారంపై తీర్పు ఇచ్చే పక్షంలో ఈ పిటిషన్‌ వాయిదా వేయాలని కోరిన హరీష్ సాల్వే
 • ఈ కేసు 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న హరీష్ సాల్వే
 • అసలు 17ఏ చుట్టే మొత్తం వ్యవహారం ఎందుకు తిరుగుతోంది?
 • నేను తప్పు చేయలేదు అని చెప్పకుండా.. 17ఏ ప్రకారం గవర్నర్‌ అనుమతి తీసుకోలేదని ఎందుకు వాదిస్తున్నారు?
 • అంటే తప్పు చేశాం కానీ.. ముందస్తు అనుమతి లేకుండా అరెస్ట్‌ చేయొద్దన్న మీ వాదనను కోర్టు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి?

సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.?

 • అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17ఏ సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్‌ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూ­డదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కనపెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది – సుప్రీంకోర్టు

సెక్షన్‌ 17 ఏ విషయమేంటీ?

 • అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌)లోని ఉన్నదే సెక్షన్‌ 17ఏ
 • 2018 జులై 26న ఈ చట్టానికి సవరణ
 • సవరణ ప్రకారం ప్రజా ప్రతినిధులను అరెస్ట్‌ చేయాలంటే సంబంధిత ఆథారిటీ అనుమతి అవసరం
   

చంద్రబాబు కేసుకు 17aకు లింకేంటీ?

 • చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న కేసు స్కిల్‌ కుంభకోణం
 • 2015-16లో స్కిల్‌ కుంభకోణం జరిగింది
 • జూన్‌ 2015లో చంద్రబాబు ఒత్తిడి, సంతకాలతో అధికారులు GO నెంబర్‌ 4 ద్వారా, 30.06.2015న రూ.371 కోట్లు విడుదల చేశారు
 • డైరెక్టరేట్ జనరల్ (GST ఇంటెలిజెన్స్), ఆదాయపు పన్ను శాఖ వెంటనే ఈ లావాదేవీలను గుర్తించాయి
 • సెక్షన్‌ 17ఏ అమలులోకి రావడానికి (2018 జులై 26కి) ముందే 2017 మే నెలలోనే స్కిల్‌ స్కామ్‌లో కేంద్ర జీఎస్టీ విభాగం కేసు నమోదు చేసింది
 • ఆంధ్రప్రదేశ్‌ ACBకి 2018 ఫిబ్రవరిలోనే ఆ విషయాన్ని తెలిపింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించాయి
 • అప్పటి చంద్రబాబు ప్రభు­­త్వం కేంద్ర ప్రభుత్వ నిఘా సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా కేసును తొక్కిపెట్టింది.
 • 2018 జులైలో 17ఏ చట్టం అమలులోకి వచ్చింది, 17ఏ చట్టం రావడానికి ముందే నేరం జరిగింది

గతంలో ఈ వ్యవహరంపై న్యాయస్థానాలేమన్నాయి?

అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 17ఏ అంటే అవినీతి నుంచి కాపాడే రక్షణ కవచం కాదు. అవినీతి కేసుల్లో నిందితులు తప్పించుకునేందుకు సాధనం కాదు. అవినీతికి పాల్పడినవారు ఆ కేసుల నుంచి తప్పించుకొనేందుకు అపాయింటింగ్‌ అథారిటీ ముందస్తు అనుమతి తప్పనిసరి కాదు’
– పట్నా హైకోర్టు 

‘సెక్షన్‌ 17 ఏ అమలులోకి రావడానికి ముందు అంటే 2018 జులై 26కి ముందు వ్యవహారాలకు ఈ చట్టం కింద రక్షణ లభించదు. అంతేకాదు అవినీతికి పాల్పడడం, ఉద్దేశపూర్వకంగా అవినీతి చేయటం అన్నవి ప్రభుత్వ విధుల నిర్వహణ కిందకు రావు’ 
– డీకే శివకుమార్‌ కేసులో కర్ణాటక హైకోర్టులో సీబీఐ వాదనలు. ఈ వాదనలతో కర్ణాటక హైకోర్టు ఏకీభవించింది

 • కళ్ల ముందు అవినీతి కనిపిస్తున్నప్పుడు సెక్షన్‌ 17ఏ వర్తించదు : పట్నా హైకోర్టు
 • ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు గానీ ప్రభుత్వ అధికారులుగానీ ఉద్దేశపూర్వకంగా ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడితే వారికి కేసుల నుంచి సెక్షన్‌ 17ఏ రక్షణ కల్పించదు
 • ఉద్దేశపూర్వకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినా సెక్షన్‌ 17ఏ కింద రక్షణ లభించదు
 • సెక్షన్‌ 17ఏ ముసుగులో అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేరు
 • ప్రస్తుతం చంద్రబాబు ఈ స్కామ్‌ నుంచి బయ­ట­పడటానికి ఆ కోణంలోనే ప్రయత్నిస్తున్నారు.
 • తన అవినీతి గురించి కాకుండా.. తనను అరెస్ట్‌ చేసిన విధానంలో సాంకేతిక కోణంలో లోపాలు వెతికేందుకు ప్రయత్నిస్తున్నారు
 • ఇప్పుడు ఎన్నికలొచ్చాయి.. ప్రజా కోర్టులో చంద్రబాబు చేసే సాంకేతిక వాదనలు ప్రజలు నమ్ముతారా?
 • తప్పు చేయలేదని న్యాయస్థానం ముందు చెప్పకుండా.. నాపై అన్యాయంగా కేసులు పెట్టారని ప్రజాకోర్టులో చెబితే నమ్ముతారా?
 • తాను అవినీతికి పాల్పడలేదని ఎక్కడా చెప్పడం లేదు
 • స్కిల్‌ డెవలప్‌­మెంట్‌ ప్రాజెక్టులో అవినీతి జరగలేదని కూడా చెప్పడం లేదు

7:00 AM, Dec 10, 2023

ప్రశ్నిస్తా అనే పవన్‌కు వైఎస్సార్‌సీపీ ప్రశ్న

 • టీడీపీ - జనసేన పొత్తు గురించి జనసైనికులు ప్రశ్నిస్తే వారి వైఎస్సార్‌సీపీకి అమ్ముడు పోయినట్లేనని పవన్‌ కళ్యాణ్‌ సూత్రీకరించాడు
 • ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన పవన్‌.. తనను మాత్రం ఎవరూ ప్రశ్నించరాదని జనసైనికులను  ఆదేశిస్తున్నారు.
 • ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీకి అమ్ముడుపోయినట్లైతే అదే ప్రశ్న జనసైనికులు కూడా వేయొచ్చు కదా..!!!
 • టీడీపీకి ఎంతకు పార్టీని అమ్మేశారని జనసైనికులకు సందేహం రాదా..?!
 • పవన్ ప్రత్యర్ధులు ఆయనను ప్యాకేజీ స్టార్ అంటుంటే ఆయనకు కోపం వస్తుంది
 • అదే మాట జనసైనికులను పవన్‌ అనవచ్చన్న మాట..!
 • ఇది ఏ పాటి ప్రజాస్వామ్యం పవన్..?
 • అసలు అబ్రహం లింకన్‌తో పవన్‌ పోల్చుకోవడం ఏంటీ..?
 • అబ్రహం లింకన్‌ కిందిస్థాయి నుంచి వచ్చి అమెరికా అధ్యక్షుడయ్యాడు
 • అమెరికాలో బానిసత్వాన్ని రద్దు చేశాడు.. అమెరికా చరిత్రను తిరగరాశాడు
 • అందుకే ఆయన అమెరికా పెత్తందార్ల చేతుల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది
 • మరీ.. పవన్‌ కళ్యాణ్ అన్న పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చాడు
 • పై నుంచి క్రమేణ కిందకు పడిపోతున్నాడు
 • రాజకీయాల్లో అదఃపాతాళానికి పడిపోయాడు
 • చేగువేరాను వదిలేసి అబ్రహం లింకన్‌ను పట్టుకుంటే ఓట్లు పడతాయని పవన్‌ అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top