నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన | Central Team Visits Cyclone Affected Areas In Nellore District | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

Dec 17 2020 8:02 PM | Updated on Dec 17 2020 8:14 PM

Central Team Visits Cyclone Affected Areas In Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు: జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. నాయుడుపేట, గూడూరు, కావలిలో నివర్ తుపాను ప్రభావంతో జిల్లాలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేసింది. గూడూరు వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించిన బృందానికి.. జేసీ హారేంద్ర ప్రసాద్ పరిస్థితిని వివరించారు. జిల్లాలో జరిగిన పంటల, ఆస్తి నష్ట వివరాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కలెక్టర్ చక్రధర్ బాబు వివరించారు. జిల్లాలో రోడ్లు, బ్రిడ్జిలు, చెరువులు దెబ్బతిన్నాయని కలెక్టర్ బృందానికి తెలిపారు. నీటమునిగిన వరి పంటల చిత్రాల ప్రదర్శన ద్వారా కేంద్ర బృందానికి వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement