విశాఖ రైల్వే జోన్‌ తధ్యం.. దుష్ప్రచారాన్ని నమ్మొద్దు | BJP MP GVL Rubbishes False News On Visakhapatnam Railway Zone | Sakshi
Sakshi News home page

విశాఖ రైల్వే జోన్‌: కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయ్‌.. నమ్మొద్దు

Sep 28 2022 2:39 PM | Updated on Sep 28 2022 4:36 PM

BJP MP GVL Rubbishes False News On Visakhapatnam Railway Zone - Sakshi

బీజేపీ ఎంపీ జీవీఎల్‌ (ఫైల్‌ ఫొటో)

కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని, విశాఖ రైల్వే జోన్‌ విషయంలో కేంద్రం.. 

సాక్షి, విశాఖపట్నం: విశాఖ రైల్వే జోన్‌ విషయంలో వస్తున్న పుకార్లను, దుష్ప్రచారాన్ని నమ్మొద్దని చెప్తున్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విశాఖ రైల్వే జోన్ రావడం లేదంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. 

‘‘విశాఖ రైల్వే జోన్ రావడం తధ్యం. అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రం చర్యలు ఇప్పటికే ప్రారంభించింది.. రైల్వేజోన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. గత పార్లమెంటు సమావేశాల్లో నేను అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సమాధానం కూడా ఇచ్చింది. ఈరోజు ఉదయం కూడా కేంద్ర రైల్వే బోర్డు ఛైర్మన్ వి కె త్రిపాఠీ మాట్లాడాను. కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి’’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు.

రైల్వే జోన్ ప్రక్రియ యధాతధంగా కొనసాగుతున్నదన్న ఎంపీ జీవీఎల్‌.. విశాఖ రైల్వే జోన్ పై వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మొద్దంటూ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement