BJP Leaders Joined In YSRCP At Guntur - Sakshi
Sakshi News home page

Guntur: గుంటూరులో బీజేపీకి బిగ్‌ షాక్‌

Aug 19 2022 8:44 AM | Updated on Aug 19 2022 1:18 PM

BJP Leaders Joined In YSRCP At Guntur - Sakshi

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు మద్దుల రాజాయాదవ్‌ నేతృత్వంలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, బీసీ నాయకులు గురువారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. 

తాడేపల్లిలో వారికి విజయసాయిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీసీల సంక్షేమానికి అన్ని విధాలుగా కృషిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పనిచేయాలని పార్టీలో చేరినట్టు మద్దుల రాజాయాదవ్‌ చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలలో పార్టీ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషిచేస్తానని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆ కాన్సెప్ట్‌ని సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా తెస్తున్నారు: కృష్ణబాబు

Advertisement
 
Advertisement
Advertisement