సాక్షి,తిరుపతి: టీటీడీలో ఆధిపత్య పోరుపై వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో అధికారుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. డిప్యూటీ ఈవో లోకనాథంపై ఏసీబీ దాడులు కుట్రలో భాగమే. లోకనాథంను టార్గెట్ చేయడం వెనుక ఆధిపత్య పోరే కారణం. అవినీతికి అవకాశమే ఇవ్వని అధికారిపై ఏసీబీ దాడులా?.అడిషనల్ ఈవో వెంకయ్యను దెబ్బతీసేందుకు లోకనాథం టార్గెట్. టీటీడీలో అధికారుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందని దుయ్యబట్టారు.


