Beneficiaries' Response To Resolution Of Dotted Lands Issues - Sakshi
Sakshi News home page

‘అన్నా మళ్లీ మీరే సీఎం కావాలి.. మేమంతా మీ వెనకే ఉంటాం’

May 12 2023 1:51 PM | Updated on May 12 2023 2:04 PM

Beneficiaries Response On Resolution Of Dotted Lands Issues - Sakshi

అందరికీ నమస్కారం, నేను 20 ఏళ్ళుగా రెండెకరాల భూమికి హక్కులు లేక గత ప్రభుత్వంలో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి. మన జగనన్న వచ్చిన తర్వాత చుక్కుల భూముల చిక్కులు శాశ్వతంగా పరిష్కరించారు.

సాక్షి, నెల్లూరు జిల్లా: దశాబ్దాలుగా రైతన్నల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చుక్కల భూముల సమస్యలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెక్‌ పెట్టారు. వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతన్నలకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించారు. శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా కావలిలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే, లబ్ధిదారులు ఏమన్నారంటే.. వారి మాటల్లోనే

జగనన్న మళ్లీ సీఎం కావాలి..
అందరికీ నమస్కారం, నేను 20 ఏళ్ళుగా రెండెకరాల భూమికి హక్కులు లేక గత ప్రభుత్వంలో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి. మన జగనన్న వచ్చిన తర్వాత చుక్కుల భూముల చిక్కులు శాశ్వతంగా పరిష్కరించారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా భార్య వికలాంగురాలు పెన్షన్‌ ఇవ్వమని గత ప్రభుత్వంలో అడిగితే ఖాళీ ఉంటే ఇస్తామని ఇవ్వలేదు, కానీ జగనన్న పాలనలో నా ఇంటికి వచ్చి పెన్షన్‌ ఇచ్చారు, రూ. 3 వేలు తలుపుతట్టి ఇస్తున్నారు, నా పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన వస్తున్నాయి, నేను దళితుడిని, నేను రెండు ఎకరాలు కౌలుకు సాగుచేస్తున్నాను, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు రూ. 41,500 నాకు పెట్టుబడి సాయం అందింది, జగనన్నను నేను జీవితంలో మరిచిపోలేను, మన దళితులు ఎదగాలంటే జగనన్న మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మనం మళ్లీ సీఎం చేసుకుంటేనే మన బిడ్డల భవిష్యత్‌ బావుంటుంది. ధన్యవాదాలు.
-మద్దెల ప్రసాదు, రైతు, ముంగమూరు, బోగోలు మండలం

మేమంతా మీ వెనకే ఉంటాం..
అన్నా నమస్కారం, మాకు 3 ఎకరాల పొలం ఉంది. అది మేం పండించుకుంటాం కానీ హక్కులు లేవు, మీరు ఈ రోజు మాకు ఆ భూమిపై హక్కులు కల్పిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. నన్ను మీరు రూ. 50 లక్షల విలువైన పొలానికి వారసురాలని చేశారు, నేనే కాదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు, నాకు ఇద్దరు పిల్లలు, వారికి అమ్మ ఒడి వస్తుంది, నేను వారిని ఇంగ్లీష్‌ మీడియంలో ప్రేవేట్‌ స్కూల్‌ లో చదివించాలనుకునేదానిని, కానీ మీరు అవన్నీ ఇవ్వడంతో వారు చక్కగా చదువుకుంటున్నారు, వాళ్ళని స్కూల్‌కు పంపుతుంటే చూడముచ్చటగా ఉంది, పిల్లలకు గోరుముద్ద పథకం కింద మంచి భోజనం ఇస్తున్నారు.

మేం తల్లిదండ్రులుగా కూడా ఆలోచించని విధంగా మీరు మేనమామగా ఆలోచించి చేస్తున్నారు, మా డ్వాక్రా సంఘంలో నాకు మూడు విడతలుగా రూ. 22 వేలు వచ్చాయి, మా సంఘానికి బ్యాంకులో రూ. 10 లక్షలు ఇవ్వగా నా వాటాగా రూ. 1 లక్ష వచ్చాయి, దానికి కూడా సున్నా వడ్డీ పథకం కింద ఏప్రిల్‌ నెలలో వడ్డీ కూడా వేస్తున్నారు, బయట అధిక వడ్డీలకు ఇస్తుంటే మీరు సున్నా వడ్డీకి ఇస్తున్నారు. మాకు రైతుభరోసా సాయం అందింది, మా మామయ్యకు పెన్షన్‌ వస్తుంది, ఉదయం ఆరుగంటలకే వలంటీర్‌ వచ్చి మీ మనవడు ఇచ్చారని ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అన్నా మీరే మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మేమంతా మీ వెనకే ఉంటాం, ధన్యవాదాలు.
-మమత, మహిళా రైతు, జక్కేపల్లి గూడూరు, బోగోలు మండలం

వైనాట్‌ 175.. తప్పకుండా గెలుస్తాం..
అందరికీ నమస్కారం, ఈ రోజు పండుగ రోజు, ఎన్నో ఏళ్లుగా చుక్కల భూముల సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతన్నల సమస్యను సీఎం పరిష్కరించారు. సీఎం రైతుల పక్షపాతి, ఆయన తండ్రి బాటలో ముందుకెళుతూ, రైతాంగానికి వెన్నుదన్నుగా ఉన్నారు, నెల్లూరు జిల్లాలో 43 వేల ఎకరాల చుక్కల భూములు ఉన్నాయి, వాటిని విముక్తి చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం రైతాంగానికి ఉపయోగకరం, పిల్లల చదువుల కోసం దేశంలో ఏ సీఎం చేయని విధంగా వేల కోట్లు ఖర్చుపెట్టి స్కూల్స్‌ రూపురేఖలు మార్చారు, గడప గడపకు వెళుతున్న సమయంలో ప్రతి ఇంటిలో ఏ విధంగా ఆదరిస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇంటింటికీ తలుపుతట్టి మరీ పెన్షన్స్‌ ఇస్తున్నారు, కావలి నియోజకవర్గ అభివృద్ది జగనన్న వల్లే సాధ్యమైంది, ఈ రోజు రామాయపట్నం పోర్ట్‌ పనులు ఏ విధంగా పరిగెత్తుతున్నాయో మనకు తెలుసు, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పనులు కూడా అతి త్వరలో పూర్తి అవుతున్నాయి, చంద్రబాబు శంకుస్ధాపనలు చేశారే తప్ప ఒక్క పని చేయలేదు.

కావలి పెద్ద చెరువును బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ చేస్తే దాదాపు 7,8 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది, రైతాంగానికి ఉపయోగకరంగా ఉంటుంది, సోమశిల నుంచి కావలికి నీరు వచ్చే పరిస్ధితి లేదు, మాకు సంగం బ్యారేజ్‌ నుంచి ఇవ్వాలని కోరాం, కావలి పట్టణంలో రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేస్తే మేం ఆ పనులు పూర్తిచేసుకుంటాం, గతంలో వైఎస్‌ఆర్‌ హయాంలో ఇందిరమ్మ కాలనీలో 6 వేల ఇళ్ళు మంజూరు అయ్యాయి కానీ అవి అసంపూర్తిగా ఉన్నాయి, వాటిని పూర్తిచేయాలని కోరుతున్నాం, జగనన్న మళ్లీ మళ్లీ సీఎం కావాలని జనం కోరుకుంటున్నారు, చాలా సంతోషం, మీరు అన్నట్లు వైనాట్‌ 175, తప్పకుండా గెలుస్తాం, ధన్యవాదాలు.
-కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement