సీఎంని కలిసిన క్రీడాకారులు బేబిరెడ్డి, అర్షద్‌  | Baby Reddy and Arshad Met CM YS Jagan | Sakshi
Sakshi News home page

సీఎంని కలిసిన క్రీడాకారులు బేబిరెడ్డి, అర్షద్‌ 

Aug 31 2022 4:05 AM | Updated on Aug 31 2022 9:09 AM

Baby Reddy and Arshad Met CM YS Jagan - Sakshi

అంతర్జాతీయ ఫెన్సింగ్‌ క్రీడాకారిణి బేబిరెడ్డిని అభినందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చిత్రంలో బేబిరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్‌ క్రీడాకారిణి మురికినాటి బేబిరెడ్డి, పారా ఏషియన్‌ ట్రాక్‌ సైక్లింగ్‌ చాంపియన్‌ షేక్‌ అర్షద్‌ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సీఎం జగన్‌ అభినందించారు.

జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో (జూనియర్స్‌ టీమ్‌)లో బేబిరెడ్డి టీమ్‌ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. అన్నమయ్య జిల్లా చెన్నముక్కపల్లెకు చెందిన బేబిరెడ్డి తాను సాధించిన పతకాలను సీఎం జగన్‌కు చూపించారు.

పారా ఏషియన్‌ ట్రాక్‌ సైక్లింగ్‌ క్రీడాకారుడు షేక్‌ అర్షద్‌ను అభినందిస్తున్న సీఎం జగన్, పక్కన కోచ్‌ ఆదిత్య మెహతా   

జాతీయస్థాయిలో టీమ్‌ పరంగా, వ్యక్తిగతంగా పతకాలు సాధించినట్లు సీఎంకు చెప్పారు. నంద్యాలకు చెందిన షేక్‌ అర్షద్‌ ఇటీవల ఢిల్లీలో జరిగిన పారా ఏషియన్‌ ట్రాక్‌ సైక్లింగ్‌లో వెండి, కాంస్య పతకాలు సాధించారు. అర్షద్‌ తాను జాతీయస్థాయిలో సాధించిన పతకాలను కూడా సీఎం జగన్‌కు చూపించారు.

అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో జరగనున్న ట్రాక్‌ వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. తమకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని సీఎం జగన్‌ని బేబిరెడ్డి, అర్షద్‌ కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంని కలిసిన వారిలో బేబిరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి, కుటుంబసభ్యులు శ్రీనివాసులురెడ్డి, వెంకట్రామిరెడ్డి, అర్షద్‌ కోచ్‌ ఆదిత్య మెహతా ఉన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement