breaking news
International Fencing Tournament
-
సీఎంని కలిసిన క్రీడాకారులు బేబిరెడ్డి, అర్షద్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబిరెడ్డి, పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ షేక్ అర్షద్ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సీఎం జగన్ అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో (జూనియర్స్ టీమ్)లో బేబిరెడ్డి టీమ్ కాంస్య పతకాన్ని గెల్చుకుంది. అన్నమయ్య జిల్లా చెన్నముక్కపల్లెకు చెందిన బేబిరెడ్డి తాను సాధించిన పతకాలను సీఎం జగన్‌కు చూపించారు. పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ క్రీడాకారుడు షేక్ అర్షద్‌ను అభినందిస్తున్న సీఎం జగన్, పక్కన కోచ్ ఆదిత్య మెహతా జాతీయస్థాయిలో టీమ్ పరంగా, వ్యక్తిగతంగా పతకాలు సాధించినట్లు సీఎంకు చెప్పారు. నంద్యాలకు చెందిన షేక్ అర్షద్ ఇటీవల ఢిల్లీలో జరిగిన పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్‌లో వెండి, కాంస్య పతకాలు సాధించారు. అర్షద్ తాను జాతీయస్థాయిలో సాధించిన పతకాలను కూడా సీఎం జగన్‌కు చూపించారు. అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో జరగనున్న ట్రాక్ వరల్డ్‌కప్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. తమకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని సీఎం జగన్‌ని బేబిరెడ్డి, అర్షద్ కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంని కలిసిన వారిలో బేబిరెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి, కుటుంబసభ్యులు శ్రీనివాసులురెడ్డి, వెంకట్రామిరెడ్డి, అర్షద్ కోచ్ ఆదిత్య మెహతా ఉన్నారు. -
ఫెన్సర్ భవానీ దేవి సంచలనం
► అంతర్జాతీయ ఈవెంట్లో స్వర్ణం ► ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు చెన్నై: భారత ఫెన్సింగ్ క్రీడాకారిణి చదలవాడ ఆనంద సుందరరామన్ (సీఏ) భవానీ దేవి సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ ఫెన్సింగ్ టోర్నమెంట్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర లిఖించింది. ఐస్లాండ్లోని రెక్జావిక్‌లో జరిగిన టర్నోయ్ శాటిలైట్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో 23 ఏళ్ల ఈ చెన్నై క్రీడాకారిణి చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన సాబెర్ ఈవెంట్ ఫైనల్లో భవాని 15–13తో సారా జేన్ హాంప్సన్ (బ్రిటన్)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో భవాని 15–11తో బ్రిటన్‌కే చెందిన జెస్సికా కోర్బీని ఓడించింది. ‘ఈ టోర్నీలో నేను మూడోసారి పాల్గొన్నాను. గతంలో రెండుసార్లు క్వార్టర్ ఫైనల్ దశ దాటలేదు. ఈసారి మాత్రం స్వర్ణం సాధించాను. ప్రపంచస్థాయి టోర్నీలో నాకిదే తొలి పతకం. గతంలో నేను ఆసియా, కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లలో పతకాలు గెలిచాను’ అని ప్రస్తుతం థలస్సేరి ‘సాయ్’ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న భవానీ దేవి తెలిపింది.