
పెడన మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు
సాక్షి, పెడన(గూడూరు): మున్సిపల్ కమిషనర్‌పై పారిశుద్ధ్య కార్మికులు దాడికి పాల్పడిన ఘటన పెడన పురపాలక సంఘంలో సోమవారం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్తుండగా తనపై పారిశుద్ధ్య కార్మికులు దాడికి పాల్పడ్డారంటూ కమిషనర్ ఎం.అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. దాడిలో డ్రైవర్‌కు గాయాలయ్యాయని తెలిపారు. అయితే తనపై కమిషనర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పారిశుద్ధ్య కార్మికురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ కార్మికులతో కలసి పురపాలక సంఘం ఎదుట నిరసనకు దిగారు. ఘటనపై ప్రత్యేక అధికారి, బందరు ఆర్డీఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి విచారణ నిర్వహించారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్సై టి.మురళి తెలిపారు. (జగన్ బాత్‌రూమ్‌ను లోకేశ్ కడిగాడా?)