జగన్‌ బాత్‌రూమ్‌ను లోకేశ్‌ కడిగాడా?

Minister Kodali Nani Fires On Nara Lokesh At gudivada - Sakshi

మంత్రి కొడాలి నాని

సాక్షి, గుడ్లవల్లేరు (గుడివాడ): పేదలకు ప్రభుత్వం నిర్మించే ఇళ్లను సీఎం వైఎస్‌ జగన్‌ ఇంటి బాత్‌రూమ్‌తో పోల్చిన లోకేశ్‌.. ఎప్పుడైనా ఆ బాత్‌రూమ్‌ను కడిగాడా? అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. పేదలకు నిర్మించే ఇంటి ని బాత్‌రూమ్‌తో పోల్చటంతో పేదలంటే లోకేశ్‌కు ఎంత చులకనో అర్ధమవుతోందన్నారు. గుడ్లవల్లేరులో శనివారం ఇళ్ల పట్టాలను అందించి, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి మంత్రి కొడాలితోపాటు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి హాజరయ్యారు. ఎవరి బాత్‌రూమ్‌ ఎంత ఉందో కొలిచే దుస్థితిలో బాబు, లోకేశ్‌ ఉన్నారని ఎద్దేవా చేశారు. పేదలపై అంత కడుపు మంట ఎందుకని కొడాలి నాని ప్రశ్నించారు. బాబు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్‌ హౌసింగ్‌ స్కీమ్‌లో ఒక్కో ఇంటి వైశాల్యం 244 చదరపు అడుగులుంటే, జగన్‌ ఇచ్చే ఇంటి వైశాల్యం 340 చదరపు అడుగులుందన్నారు. 

వైఎస్సార్‌ భూసేకరణ.. పట్టాలిస్తున్న జగన్‌
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 12 ఏళ్ల కిందట గుడ్లవల్లేరులో 31 ఎకరాలను ఇళ్ల స్థలాలకు భూసేకరణ చేస్తే.. ఇప్పుడు అక్కడ వైఎస్‌ జగన్‌ వాటికి పట్టాలిచ్చి ఇళ్లను నిర్మిస్తున్నారని కొడాలి నాని అన్నారు. వైఎస్‌ మరణానంతరం, కిరణ్, రోశయ్య, చంద్రబాబు  ఈ ప్రాంతానికి ఐదు పైసలు కూడా ఖర్చు పెట్టడంగాని ఒక్క ఇంటి పట్టా ఇవ్వడంగాని చేయలేకపోయారన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top