సాక్షి, అమరావతి: ఏపీ టెట్ 2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేయనుంది. పూర్తి సమాచారం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు జాయింట్ డైరెక్టర్, ఏపీ టెట్ కన్వీనర్ ఎం. వెంకటకృష్ణారెడ్డి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

అభ్యర్థుల సందేహాలను తీర్చడం కోసం డైరెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ అందుబాటులో ఉండేలా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. మెగా డీఎస్సీ 2025 స్కాంపై ప్రజలు, ఉపాధ్యాయ అభ్యర్థుల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశం నుంచి వారి దృష్టిని మళ్లించి, ఏమార్చేందుకే ప్రభుత్వం హఠాత్తుగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలుస్తోంది.


