సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థలు, 106 మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. రిజర్వేషన్లపై కసరత్తు పూర్తికావడంతో తుది జాబితాను నేడు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ జాబితాతో ఏ నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలో ఏ వర్గానికి ప్రాతినిధ్యం దక్కనుందో స్పష్టత రానుంది.
నగరపాలక సంస్థల రిజర్వేషన్లు ఇలా..
ఎస్టీ-జనరల్: మంగళగిరి
ఎస్సీ-మహిళ: కర్నూలు
ఎస్సీ-జనరల్: రాజమహేంద్రవరం
బీసీ-మహిళలు: మచిలీపట్నం, కాకినాడ,
బీసీ-జనరల్: చిత్తూరు, అనంతపురం, ఏలూరు
మహిళలు-జనరల్: శ్రీకాకుళం, విజయనగరం, వైఎస్సార్ జిల్లా, గుంటూరు, కడప, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్
అన్‌రిజర్వ్‌డ్: ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ
పురపాలక సంఘాలు: 106
ఎస్టీ-మహిళ: గూడూరు
ఎస్టీ-జనరల్: ఆత్మకూరు, ఆలూరు
ఎస్సీ-మహిళలు: కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, చింతలపూడి, సూళ్లూరుపేట, గుత్తి, చీరాల
ఎస్సీ-జనరల్: ఉయ్యూరు, నూజివీడు, కుప్పం, సామర్లకోట, పిఠాపురం, బాపట్ల, పొదిలి
బీసీ-మహిళ: జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం, నాయుడుపేట,చిలకలూరిపేట, ఇచ్ఛాపురం, కొవ్వూరు, పాలకొల్లు, గుంతకల్లు, గుడివాడ, నందిగామ, ముమ్మిడివరం, మదనపల్లె, నరసరావుపేట, అమలాపురం
బీసీ-జనరల్: కావలి, కదిరి, బి.కొత్తకోట, కందుకూరు, హిందూపురం, ఆత్మకూరు (నెల్లూరు), అద్దంకి, కమలాపురం, నెల్లిమర్ల, మడకశిర, ఆళ్లగడ్డ, గురజాల, దాచేపల్లి, గొల్లప్రోలు, మార్కాపురం, నంద్యాల, బేతంచెర్ల, నందికొట్కూరు, దర్శి, గూడూరు (కర్నూలు), మైదుకూరు, బద్వేలు
జనరల్-మహిళ:
కనిగిరి, వెంకటగిరి, నరసాపురం, పలాస-కాశీబుగ్గ, పెడన, పలమనేరు, జమ్మలమడుగు, ఆకివీడు, పాలకొండ, పొన్నూరు, భీమవరం, జగ్గయ్యపేట, బుచ్చిరెడ్డిపాళెం, ఎర్రగుంట్ల, యలమంచిలి, కల్యాణదుర్గం, ఆమదాలవలస, పుంగనూరు, మాచర్ల, రాజంపేట, ఆదోని, డోన్, రాజాం, బొబ్బిలి, రేపల్లె, పులివెందుల, ఎమ్మిగనూరు
అన్ రిజర్వ్‌డ్: పుట్టపర్తి, పెనుకొండ, రాయచోటి, సాలూరు, తణుకు, తెనాలి, తాడేపల్లిగూడెం, రామచంద్రాపురం, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తుని, పార్వతీపురం, ప్రొద్దుటూరు, పుత్తూరు, మండపేట, నగరి, చీమకుర్తి, తిరువూరు, రాయదుర్గం, గిద్దలూరు, వినుకొండ, పెద్దాపురం, ధర్మవరం, తాడిగడప, పిడుగురాళ్ల, తాడిపత్రి ఉన్నాయి.
ఇదీ చదవండి: ‘పవన్ చెప్పేది ఏంది బోడి..’ తెలుగు తమ్ముళ్ల సెటైర్లు!


