‘చంద్రబాబుకు భయపడే టీడీపీ నేతలు నోరు నొక్కేసుకుంటున్నారు’

AP Ministers Angry On TDP And BJP Leaders Over Vishakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో టీడీపీ, బీజేపీ నాయకులపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి అమర్నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్రపై టీడీపీ, బీజేపీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు. 

విశాఖ రాజధానిగా ఎందుకు వద్దంటున్నారో టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలి. జేఏసీ కార్యాచరణకు అనుగుణంగానే విశాఖ గర్జన ర్యాలీ జరుగుతుంది. రైతు సంఘాలు, విద్యార్థులు, న్యాయవాదులు ఈ ర్యాలీలో పాల్గొంటారు. టీడీపీ అధినేత డైరెక్షన్‌లోనే పాదయాత్ర నడుస్తోంది. పెయిడ్‌ ఆర్టిస్టులు తమ యాత్రను విరమించుకోవాలి’ అని స్పష్టం చేశారు.

మరోవైపు, మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీల నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. పార్టీలకు అతీతంగా అందరూ విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకుంటున్నారు. టీడీపీ నేతలు చంద్రబాబుకు భయపడి వారి గొంతు నొక్కేసుకుంటున్నారు’ అని అన్నారు. 

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే నినాదం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో చాలా ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. వికేంద్రీకరణ జరగకపోతే భావితరాలు క్షమించవు అంటూ కామెంట్స్‌ చేశారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top