సాక్షి, విజయవాడ: ఏపీ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలా రిజర్వేషన్లు ఇస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒక వైపు కమిషన్ నివేదిక పరిశీలనలో ఉందని చెబుతున్నారు. నివేదిక పరిశీలనలో ఉందని ఎంతకాలం చెబుతారు.? అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది
కమిషన్ నివేదిక ఎందుకు బహిర్గతం చేయటం లేదు. కమిషన్ నివేదికలో ఏమైనా రహస్యం ఉందా? అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. బీసీ రిజర్వేషన్ల పూర్తి గణాంకాలను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. 34 శాతం రిజర్వేషన్లను ఎలా సమర్థించుకుంటారో చెప్పాలన్న కోర్టు.. తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.


