టీడీపీ నేత పట్టాభికి బెయిల్..

సాక్షి, విజయవాడ: టీడీపీ నేత పట్టాభికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు శనివారం విచారణ జరిపింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పట్టాభి.. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నారు. ఆయనకు విజయవాడలో కోర్టు గురువారం 14 రోజుల రిమాండ్ విధించటంతో మచిలీపట్నం జైలుకు తరలించారు. అక్కడ నుంచి ఆయన్ని శుక్రవారం ఉదయం ప్రత్యేక వాహనంలో పోలీస్ భద్రత మధ్య రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తీసుకెళ్లిన సంగతి విదితమే.
చదవండి: నారా వారి తాజా చిత్రం ‘36 గంటలు’.. సిగ్గు చచ్చింది
సంబంధిత వార్తలు