
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40 స్నాతకోత్సవాలు మంగళవారం జరిగాయి..
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40 స్నాతకోత్సవాలు మంగళవారం జరిగాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రోఫిసర్ హేమచంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పీహెచ్‌డీ స్కాలర్స్‌కు డాక్టరేట్ పట్టాలు, బంగారు పథకాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ అందించారు. అలాగే.. ప్రముఖ రచయిత, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్‌కు గౌరవ డాక్టరేట్ ను గవర్నర్ నజీర్ ప్రదానం చేశారు.