Corona virus: ఏపీలో కొత్తగా 2,982 కేసులు

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతుంది. గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గడంతోపాటు, రికవరీల రేటు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 91,070  మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 28 మంది మృత్యువాతపడ్డారు.

దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,946 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 3,461 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 69 వేల 417 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 31,850 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,14,213 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు  2,26,99,142 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top