AP Covid Cases Yesterday: AP Government Released The Bulletin On Corona Virus - Sakshi
Sakshi News home page

ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు..

Jul 5 2021 6:09 PM | Updated on Jul 6 2021 5:23 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గడంతోపాటు,  రికవరీల రేటు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 72,731 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,100 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 26 మంది మృత్యువాతపడ్డారు.

దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,870 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 3,435 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 58 వేల 189 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 33,964 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,90,5023 కు చేరింది. రాష్ట్రంలో నేటి వరకు 2,24,35,809 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement