ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రికల్‌ వాహనాలు

AP Government Give Electric Two Wheelers To Govt Employees Over Loan Based - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రికల్‌ వాహనాలను  ప్రభుత్వం అందించనుంది. వాయిదా పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రికల్‌ టూవీలర్లను ఇవ్వనుంది. డౌన్‌ పేమెంట్‌ లేకుండా ఈఎంఐ వాయిదాల వెసులుబాటు కల్పిస్తోంది. సచివాలయ, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించనుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రుణాలపై ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్‌టీపీసీ/ఈఈఎస్‌ఎల్‌ వంటి సంస్థలతో కలిసి నెడ్‌క్యాప్‌ ఒక పథకాన్ని రూపొందించినట్లు ఇంధన శాఖ తెలిపింది. రుణాన్ని 24 నెలల నుంచి 60 నెలల్లో తీర్చే విధంగా వివిధ సంస్థలతో చర్చిస్తున్నామని, వాహన ధర బ్యాటరీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని ఏప్రిల్‌ నెలలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top