AP Political News Jan 9th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections Political News Updates And Headlines 9th Jan 2024 Telugu | Sakshi
Sakshi News home page

AP Political News Jan 9th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Jan 9 2024 6:59 AM | Updated on Jan 9 2024 9:35 PM

AP Elections Political News Updates And Headlines 9th Jan 2024 Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

9:34PM, జనవరి 9, 2024

  • సీఎం క్యాంప్ ఆఫీసుకు కలిసి వచ్చిన  వైఎస్పార్‌సీపీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి, మల్లాది విష్ణు
  • సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇటీవల వెల్లంపల్లి శ్రీనివాస్ నియామకం
  • వెల్లంపల్లి, మల్లాదిలతో చర్చించిన పార్టీ ముఖ్య నేతలు
  • ఇద్దరినీ సమ్వయం చేసిన పార్టీ ముఖ్యనేతలు

9:25PM, జనవరి 9, 2024

ఊపిరి ఉన్నంత వరకు జగనన్న బాటలోనే నడుస్తా: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

  • నీటి సమస్యపై నిలదీస్తే జగనన్నకు ఆపాదిస్తూ తప్పుడు రాతలా..?
  • దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నించడం నేరమా రామోజీ..?
  • జగనన్న మాటే నాకు శిరోధార్యం
  • ఊపిరి ఉన్నంత వరకు జగనన్న బాటలోనే నడుస్తా..
  • జగనన్న చెబితే పదవిలేకున్నా పార్టీ కోసం పనిచేస్తా..
  • ఏపీలో ఎస్సీలకు జరిగిన మేలు దేశంలో మరే రాష్ట్రంలో జరగలేదు
  • రాజకీయాల్లో చీడపురుగైన చంద్రబాబు దేశం వదిలిపోవాలి

 
07:24PM, జనవరి9, 2024

హైదరాబాద్‌లో ఓటేసి ఇక్కడా ఓటేస్తామంటే కుదరదు బాబూ..!: మంత్రి అంబటి

  • పార్టీ ఫిరాయింపు దొంగతో కలసి వెళ్ళి దొంగ ఓట్లపై ఫిర్యాదా.. !?
  • తెలంగాణలో ఓటుకు నోటు ఇచ్చి దొంగ ఓట్లు కొంటూనే కదా పట్టుబడింది బాబూ..!
  • హవ్వ.. నవ్విపోతారన్న సిగ్గు అన్నా లేదా బాబూ..!
  • దొంగ ఓట్లకు ఆద్యుడు చంద్రబాబే..
  • చంద్రబాబు ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు
  • గెలిచిన ప్రతిసారీ కుప్పంలో దొంగ ఓట్లతోనే బాబు గెలిచాడు. 
  • హైదరాబాద్‌లో ఓటేసి ఇక్కడా ఓటేస్తామంటే కుదరదు బాబూ..!
  • ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరిగితే చంద్రబాబు కుప్పంలో ఓడిపోవడం ఖాయం
  • బాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.. కుట్రలు, క్యాష్, కుతంత్రాలపైనే నమ్మకం
  • అలాంటి నీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటానికి బుద్ధి ఉందా..?

07:00PM, జనవరి 9, 2024

 ఆళ్లగడ్డ సభలో బాబుకు షాక్‌ ఇచ్చిన జూ.ఎన్టీఆర్‌ అభిమానులు

  • కాబోయే సీఎం జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటూ ఫ్లెక్సీలు
  • చేసేదేమీ లేక నివ్వరపోయిన తెలుగుదేశం నాయకులు
  • చంద్రబాబు సభలో వెనుదిరిగి వెళ్లిన ప్రజలు
  • చంద్రబాబు సొల్లు వినలేక మధ్యలో వెళ్లిపోయిన జనాలు

06:00PM, జనవరి 9, 2024

వై నాట్ 175 నినాదం నిజం చేయాలి:  సినీ నటుడు అలీ

  • వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి సీఎం జగన్‌కు గిఫ్ట్ ఇవ్వాలి 
  • వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర విజయయాత్రను తలపిస్తోంది
  • గుంతకల్లు లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని లక్ష మెజారిటీ తో గెలిపించాలి

05:00PM, జనవరి 9, 2024

వైఎస్సార్‌సీపీ ఘన విజయం కోసమే మార్పులు: ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి

  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేసి సామాజిక న్యాయం చేశారు
  • వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం కోసమే మార్పులు - చేర్పులు
  • వై నాట్ 175 అన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నినాదం
  • గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తెచ్చిన ఘనత సీఎం జగన్‌దే
     

04:10PM, జనవరి 9, 2024

వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు:  ఎంపీ నందిగాం సురేష్ 

  • 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు.. 4 ఏళ్ల వైఎస్ జగన్ పాలనకు ఎంతో తేడా ఉంది
  • ప్రజలకు మంచి చేసే నైజం సీఎం జగన్‌కు ఉంది
  • వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు
  • చంద్రబాబు ఆరోపణలు హాస్యాస్పదం
  • రాజధాని అమరావతి అవినీతిలో పవన్ కళ్యాణ్‌కు భాగస్వామ్యం కల్పించిన దుర్మార్గుడు చంద్రబాబు
  • చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చరమగీతం పాడుతాం
  • తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. ఏపీలో టీడీపీ వస్తుందన్నట్లు చంద్రబాబు హడావుడి చేస్తున్నారు
  • రెండు ఎకరాల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయల కు చంద్రబాబు అక్రమ సంపాదన
  • ప్రజల్లో ఉండే నాయకులకే సీఎం జగన్ టిక్కెట్లు ఇస్తున్నారు
  • సమన్వయకర్తల నియామకంలో కులాలను అంటగట్టొద్దు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశారు

04:05PM, జనవరి 9, 2024

టీడీపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు

నంద్యాల జిల్లా:

  • ఆళ్ళగడ్డ లో మరో సారి బట్టబయలు అయిన టీడీపీ వర్గవిభేదాలు
  • ఆళ్ళగడ్డకు చేరుకున్న చంద్రబాబు,  రాకదలిరా  బహిరంగ సభ లో పాల్గొనని జన సేన నాయకుడు ఇరుగల రాంపుల్లారెడ్డి  
  • చంద్రబాబు రా కదలిరా కార్యక్రమానికి హాజరుకాని ఏ.వి. సుబ్బారెడ్డి

03:27PM, జనవరి 9, 2024
విజయవాడ:

టీడీపీ పార్టీకి మరో షాకిచ్చిన ఎంపీ కేశినేని నాని

  • తన కార్యాలయం కేశినేని భవన్ పై ఉన్న టీడీపీ జెండాలను తొలగించిన కేశినేని నాని
  • తాజాగా కేశినేని భవన్ పై టీడీపీ పార్టీ ఫ్లెక్సీలు ...చంద్రబాబు భారీ ఫ్లెక్సీలు తొలగింపు 
  • చంద్రబాబు, ఎన్టీఆర్,  కేశినేని నాని ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీల స్థానంలో కేశినేని నాని, కేశినేని శ్వేత ఫ్లెక్సీలు ఏర్పాటు

2:21PM, జనవరి 9, 2024

చంద్రబాబు పొత్తు పెట్టుకోని పార్టీ ఉందా?: మంత్రి మేరుగు నాగార్జున

  • పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు సీఎం జగన్‌
  • విమర్శలు చేసేందుకు కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు
  • అంబేద్కర్‌ ఆలోచలను ఆచరణలో పెట్టిన నేత సీఎం జగన్‌
  • చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏవీ నెరవేర్చలేదు
  • సీఎం జగన్‌ను కేంద్ర కమిటీ సభ్యులు ఆకాశానికి ఎత్తారు
  • నాలుగేళ్లలో 12శాతం ఉన్న పేదరికం 6శాతానికి తగ్గింది
  • సీఎం జగన్ లోతైన ఆలోచనాసరళి సత్ఫాలితాలను చూపిస్తున్నాయి
  • ప్రతిపక్షాలు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి
  • చంద్రబాబు మరోసారి అధికారం కోసం అర్రులు చాచుతున్నారు 
  • రాష్ట్రంలోనే బడుగు బలహీ వర్గాలను సీఎం జగన్‌కు దూరం చెసేందుకు కుయుక్తులు పన్నుతున్నారు 
  • రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఒక్క కార్యక్రమం చంద్రబాబు చేయలేదు 
  • మేధావులు జగన్ పాలనను మెచ్చుకుంటున్నారు

1:54 PM, జనవరి 9, 2024
కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది: ఎంపీ గురుమూర్తి

  • అందుకే దొంగ ఓట్లు అంటూ హడావుడి చేస్తున్నారు
  • ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు  తప్పుడు ఫిర్యాదులు
  • దళితులను అక్కున చేర్చుకున్న నేత జగన్
  • దళితులపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు కరెక్టు కాదు
     

1:09 PM, జనవరి 9, 2024
ఎన్నికలకు ముందే చంద్రబాబు, పవన్ అస్త్ర సన్యాసం: మంత్రి జోగి రమేష్

  • ఎన్నికలలో పోటీ చేసే ధైర్యం లేక ఎన్నికల కమిషన్‌కు తప్పుడు ఫిర్యాదులు
  • అన్ని పార్టీలు కట్ట కట్టుకుని వచ్చినా జగన్‌ని ఏమీ చేయలేరు
  • చంద్రబాబుకు ప్రజల్లో గుర్తింపు లేదు
  •  ఓటమికి కారణాలను ముందే వెతుక్కుంటున్నారు
  • జనసేనకు ఎన్నికల కమిషన్ దగ్గర గుర్తింపు లేదు
  • ఎన్నికలకు ముందే చంద్రబాబు, పవన్‌ అస్త్రసన్యాసం చేశారు
  • 175 నియోజకవర్గాలలో పోటీ చేయడానికి అసలు టీడీపీ, జనసేనకు అభ్యర్థులు ఉన్నారా?
  • ఇలాంటి వారు వైఎస్సార్‌సీపీని ఏమీ చేయలేరు

12:43 PM, జనవరి 9, 2024
సీఈసీని కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి బృందం

  • జనసేన గుర్తింపులేని పార్టీ
  • గుర్తింపులేని పార్టీ జనసేనను ఎలా అనుమతించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం
  • జనసేనకు ఉన్న గ్లాస్‌ గుర్తు జనరల్‌ సింబల్‌
  • ఆరు అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం
  • మై పార్టీ డ్యాష్‌ బోర్డును విదేశాల నుంచి టీడీపీ నడిపిస్తోందని ఫిర్యాదు చేశాం
  • టీడీపీ ఇల్లీగల్‌ ఓటర్‌ ప్రొఫైల్‌ తయారు చేస్తోంది
  • టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశాం
  • కోనేరు సురేష్ అనే వ్యక్తి పదిలక్షలపై చిలుకు ఓట్లు బోగస్ అని సీఈవోకి ఫిర్యాదు ఇచ్చాడు.‌
  • ఒక వ్యక్తికి బోగస్ ఓట్లు ఉన్నాయని ఎలా తెలుస్తుంది?
  • బోగస్ ఓట్ల గురించి బీఎల్ఓస్ చెప్పాలి, గాని ఒక వ్యక్తి ఎలా చెబుతున్నాడు‌?
  • ఆ ఫిర్యాదే బోగస్ అని చర్యలు తీసుకోమన్నాం
  • రాష్ట్రవ్యాప్తంగా బోగస్ ఓట్లు అనేవి లేవని కలెక్టర్లు నివేదిక ఇచ్చారు
  • టీడీపీ వారు ఉద్ధేశ పూర్వకంగా వైఎస్సార్‌సీపీ ఓటర్లను టార్గెట్ చేస్తున్నారు
  • అలాంటి వారిపై ఫిర్యాదు చేశాం
  • తెలంగాణ ఓటర్లు ఏపీలో కూడా ఓటర్లుగా ఉన్నారు
  • ఇలాంటి డూప్లికేట్ ఓట్లను తొలగించాలని కోరాం
  • తెలంగాణ ఓటర్ లిస్టులో డిలీట్ చేశాకే ఏపీలో ఓటరగా నమోదు చేసుకోవాలి
  • యువగళం, చంద్రబాబు సభలో అసభ్యపదజాలంతో సీఎం జగన్‌ను విమర్శించారు
  • లోకేష్ ఎర్రబుక్‌ పేరుతో అధికారులను బెదిరిస్తున్నాడు
  • అధికారుల‌ పేర్లు నోట్ చేసుకుంటున్నా వాళ్లను సర్వీస్ నుండి తీసేస్తాం అంటూ లోకేష్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
  • లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని కోరాం
  • రెండు రాష్ట్రాలకు ఒకే రోజు ఎన్నికలు జరపాలని కోరాం 
  • ఒకే రోజు ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లను అరికట్టవచ్చు 
  • చంద్రబాబు జీవితమే మోసపూరితం..కుట్రలతో నిండిపోయింది

12:02 PM, జనవరి 9, 2024
సీఎం జగన్ పాదయాత్ర ఓ చారిత్రక ఘట్టం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

  • ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ప్రజల కష్టాలు తెలుసుకున్నారు
  • 99.5 శాతం హామీలను అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే
  • కరోనా సమయం లోనూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగించింది
  • కరోనా సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఇంట్లో దాక్కోలేదా?
     

11:42 AM, జనవరి 9, 2024
హిందూపురంలో బాలకృష్ణకు చేదు అనుభవం

  • హిందూపురం టీడీపీ నేతల మధ్య ఆధిపత్యపోరు
  • సమావేశానికి వచ్చిన రెండువర్గాల నాయకులు
  • నేతల తీరుపై బాలకృష్ణ అసహనం
  • అభిమానులు ఇచ్చిన పూల బొకేలను విసిరేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ

11:36 AM, జనవరి 9, 2024
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య భగ్గుమన్న వర్గ విభేదాలు
ఆళ్లగడ్డలో చంద్రబాబు ‘రా కదలిరా’ కార్యక్రమానికి జనసేనకు చెందిన ఇరిగెల వర్గం దూరం
కనీసం  ‘రా కదలిరా’ కార్యక్రమానికి పిలుపు లేదన్న ఇరిగెల రాంపుల్లా రెడ్డి  
ఏవీ సుబ్బారెడ్డిని సభకు రావొద్దంటూ అల్టిమేటం జారీ చేసిన అఖిల ప్రియ
అఖిల ప్రియపై మండిపడుతున్న ఏవీ సుబ్బారెడ్డి వర్గం 

11:30 AM, జనవరి 9, 2024
పవన్‌ కల్యాణ్‌పై కేఏ పాల్‌ కీలక వ్యాఖ్యలు

  • కాపు సోదరులారా మేల్కొనండి
  • రంగాను చంపిన ఆ పార్టీ వెంట వెళ్లకండి
  • పవన్ కళ్యాణ్‌కు నా పర్సనల్ రిక్వెస్ట్‌
  • వంగవీటి రంగాను చంపిన టీడీపీతో కలవొద్దు
  • నేను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా 
  • నా పై విషప్రయోగం జరిగింది 
  • ఎవరు చేశారో కూడా తెలిసింది.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
     

10:26 AM, జనవరి 9, 2024
అసంతృప్తి ‘కన్నా’లెన్నో!

  • కన్నా లక్ష్మీనారాయణకు కలిసిరాని సత్తెనపల్లి.. టీడీపీ అధిష్టానం సూచనతో అయిష్టంగానే అక్కడికి..
  • సహకరించని తెలుగు తమ్ముళ్లు 
  • మూడు గ్రూపులుగా విడిపోయిన పార్టీ  
  • ఇంటింటికీ రెబల్‌ కోడెల శివరాం 
  • టీడీపీకి వ్యతిరేకంగా కాపులను ఏకం చేస్తున్న జనసేన ఇన్‌చార్జి  
  • గుంటూరు వెస్ట్‌కు వెళ్లిపోతానని అధిష్టానంతో కన్నా మొర

9:17 AM, జనవరి 9, 2024
మా వల్ల కాదు బాబూ.. 

  • సభకు కోట్లు కోట్లు కావాలంటే ఎక్కడి నుంచి తేవాలి? 
  • టికెట్‌ నాకే ఇస్తున్నట్లు సభలో ప్రకటిస్తామంటేనే ఖర్చు పెట్టుకుంటా 
  • టీడీపీ అధినేత చంద్రబాబుకు భూమా అఖిలప్రియ అల్టీమేటం 
  • జన సమీకరణ గురించి పట్టించుకోని వైనం 
  • నేడు చంద్రబాబు సభ నేపథ్యంలో కేడర్‌లో అయోమయం 
  • పరువు పోకుండా చూడాలని జిల్లా నేతలు అధిష్టానానికి వినతి 
  • అఖిల బెదిరింపులకు లొంగమని బాబు స్పష్టికరణ 
  • పక్క నియోజకవర్గాల నుంచి జనాన్ని రప్పించాలని పెద్దల ఆదేశం

8:30 AM, జనవరి 9, 2024
కొలికపూడి, టీవీ5 సాంబశివరావులను విచారించిన సీఐడీ

  • ఆర్జీవీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో సుదీర్ఘవిచారణ
  • 12న మరోసారి విచారణకు రావాలని ఆదేశం
  • సినీ దర్శకుడు రామ్‌­గో­పాల్‌ వర్మ తల­నరి­కి తెస్తే రూ.కోటి ఇస్తా­నంటూ కొలి­కపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఈ కేసులో కొలి­కపూడి , టీవీ 5 న్యూస్‌ యాంకర్‌ సాంబశి­వ­రావులను విచారించిన సీఐడీ అధికారులు
  • గుంటూరులోని సీఐడీ కార్యా­ల­యంలో వా­రి­ద్దరిని కలిపి, విడివిడిగానూ విచారణ
  • టీవీ 5 చానల్‌ నిర్వహించిన డిబేట్‌ ద్వారా తన హత్యకు ప్రేరేపించేందుకు ఉద్దేశపూ­ర్వ­కంగానే కొలికపూడి  ఆ వ్యాఖ్యలు చేశారని రామ్‌గోపాల్‌ వర్మ ఫిర్యా­దు
  • ఆర్జీవీని హత్య చేసేలా ఎందుకు వ్యాఖ్యానించారు?
  • ఉద్దేశపూర్వకంగానే మాట్లా­డా­రా?
  • ఆ వ్యాఖ్యలతో ప్రేరేపితమై ఎవరైనా అవాంఛనీ­య ఘటనకు పాల్పడితే పరిణామాలు ఎలా ఉంటాయో అవగాహన ఉందా?
  • సమాజంలో విద్వేషాలు రేకెత్తించకూ­డదన్న అవగాహన లేదా..?
  • వారిద్దరిపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం
  • కానీ సీఐడీ అధికారుల ప్రశ్నలకు కొలికపూడి శ్రీనివాసరావు, సాంబశివరావు సూటిగా సమాధానం చెప్పలేదని సమాచారం.
  • వారిద్దరి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న సీఐడీ అధికారులు
  • ఈ నెల 12న మరోసారి విచారణకు రావాలని ఆదేశం

7:59 AM, జనవరి 9, 2024
లోకేశ్‌ దెబ్బకు టీడీపీ కకావికలు

  • ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీలో ముసలం
  • బాబు, లోకేశ్‌ శైలితో రగిలిపోతున్న కేశినేని నాని వర్గం
  • కేశినేని నాని బాటలో మరింత మంది నేతలు
  • టీడీపీలో మొదలైన రాజీనామాల పర్వం
  • కార్పొరేటర్‌ కేశినేని శ్వేత రాజీనామా
  • పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని ఆవేదన
  • పొమ్మన్న తర్వాత కూడా ఉండలేమని స్పష్టీకరణ
  • బాబాయ్‌ చిన్ని గురించి మాట్లాడి స్థాయి తగ్గించుకోలేమని వ్యాఖ్య
  • జిల్లాలో పార్టీ ముగ్గురి చెప్పు చేతల్లో నడుస్తోందంటున్న నాని వర్గీయులు
  • బెజవాడతోపాటు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులు లేరని వెల్లడి
     

7:48 AM, జనవరి 9, 2024
యనమల ఇంట్లో టికెట్‌ లొల్లి

  • తమ్ముడు కృష్ణుడిని పక్కనపెట్టిన యనమల
  • కూతురు దివ్యను ఇన్‌చార్జిగా నియమించడంతో రగిలిపోతున్న తమ్ముడు
  • తాజాగా తెరపైకి యనమల రాజేష్‌.. అతన్ని దూరం పెట్టాలని కృష్ణుడి పట్టు
  • ‘బాబు’ తుని సమావేశం లోపు తేల్చాలని డిమాండ్‌ 
  • ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గో­దా­వ­రి జిల్లా టీడీపీలో తెరవెనుక రాజకీయాలను శాసించిన యనమల రామకృష్ణుడు
  • పెద్ద తల­నొప్పిలా మా­­రిన ఇంటిపోరు
  • ఈ ఇంటి పోరుతో తుని నియోజకవర్గంలో తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు

​​​​

7:42 AM, జనవరి 9, 2024
నేడు గుంతకల్లు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర

  • ఎమ్మెల్యే వై‌.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న బస్సు యాత్ర
  • సీఎం జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెద్దపీట వేయడంపై హర్షం 
  • గుంతకల్లు అజంతా సర్కిల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న బస్సు యాత్ర
  • 4 గంటలకు గుంతకల్లు వైఎస్సార్ సర్కిల్ లో బహిరంగ సభ
  • హాజరుకానున్న సినీనటుడు ఆలీ, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు నందిగం సురేష్, తలారి రంగయ్య
     

7:25 AM, జనవరి 9, 2024
ఎంపీ అభ్యర్థులు కావలెను

  • బరువైన సూట్‌కేసుతో వచ్చిన వారికే ప్రాధాన్యం 
  • ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ దయనీయం
  • గుంటూరు ఎంపీ బరి నుంచి తప్పుకున్న గల్లా జయదేవ్‌.. 
  • మాకొద్దంటే మాకొద్దంటున్న ఆలపాటి, ధూళిపాళ్ల.. ఓ విద్యా సంస్థల చైర్మన్‌ సైతం వెనకడుగు
  • నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ స్థానాలకూ ఎవరికి వారు ససేమిరా
  • రూ.వంద కోట్ల లోకేశ్‌ షరతుతో బెంబేలు.. ముందుకు రాని నేతలు
  • దీంతో ఎన్నారైల కోసం పార్టీ అన్వేషణ

7:13 AM, జనవరి 9, 2024
నేడు, రేపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన 

  • ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించనున్న కేంద్ర ఎన్నికల కమిషనర్లు 
  • రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాలను పరిశీలన
  • నేటి నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన
  • కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం
  • జనవరి 9వ తేదీ ఉ.10 గంటల నుంచి 12 గంటల వరకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం
  • మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్‌ఎస్‌ఆర్‌–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను సమీక్ష
  • ఓటర్ల జాబితాలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు
  • వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 5.64 లక్షల పేర్లను అనర్హులుగా తేల్చాం: ఎస్‌ఈసీ ముఖేష్ కుమార్‌ మీనా

7:01 AM, జనవరి 9, 2024
టీడీపీ, జనసేనల మధ్య కుర్చీల కుస్తీ..

  • ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఖరారుపై టీడీపీ, జనసేన కుస్తీలు 
  • ఐదు స్థానాలు కావాలని పట్టుబడుతున్న జనసేన
  • రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురం, మండపేట, కొత్తపేటపై జనసేన ఆశలు 
  • ఈ ఐదు స్థానాల్లో బలంగా ఉన్న టీడీపీ అభ్యర్థులు
  • అవే స్థానాలు కావాలని పట్టుపడుతున్న జనసేన 
  • జనసేనకు ఇస్తే టీడీపీ సిట్టింగులు సీట్లను వదులుకోవాల్సిన పరిస్థితి
  • అధినేతల పొత్తు అసలుకే మోసం తెచిందంటున్న నాయకులు
     

6:55 AM, జనవరి 9, 2024
అంగన్‌వాడీల సమ్మెలో రాజకీయ ప్రమేయం ఉంది: సజ్జల

  • అంగన్‌వాడీల సమ్మెను కొన్ని శక్తులు నడిపిస్తున్నాయి
  • రౌండ్‌ టేబుల్‌ పేరుతో టీడీపీ వాళ్లంతా అక్కడ చేరారు
  • అంగన్‌వాడీలకు ప్రభుత్వం చేయగలిగినంత చేసింది
  • ఎందుకు చేయలేకపోతున్నామనేది వివరంగా చెప్పాం
  • ఎంతకాలమని సమ్మెలో ఉంటారు
  • పేదలకు ఇబ్బందులు కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది
  • చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో అందరికీ గుర్తుంది
  • అంగనవాడీ కార్యకర్తల ఆందోళనలపై అనేక స్థాయిలో చర్చించాం 
  • వారి సమ్మె వెనుక రాజకీయ కోణం ఉంది
  • వాట్సప్ గ్రూపుల్లో వారి ఆడియోలు మేము విన్నాం
  • కొందరు రాజకీయ కోణంలో రెచ్చగొడుతూ మాట్లాడారు
  • రాజకీయ అజెండాకి బలి కావద్దు
  • ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చేస్తున్నాం
  • గర్భిణీలు, పసిపిల్లలను ఇబ్బందులు పెట్ట వద్దు
  • పట్టు వీడకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చేస్తుంది
  • మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కూడా ఇది వర్తిస్తుంది
  • సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఉన్న వారంతా అంగన్ వాడీలను రెచ్చగొడుతున్నారు
  • వారి వలలో చిక్కుకోవద్దు 
  • ప్రభుత్వాన్ని దించుతాం, జైళ్లకైనా వెళ్తాం అంటూ కొందరు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు
  • పేద తల్లులు, పిల్లలకు ఆహారం అందకపోవటం మంచిదేనా చంద్రబాబు చెప్పాలి
  • అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అంగన్‌వాడీలకు అన్యాయం చేశారు
  • సమ్మె విరమించమని అంగనవాడీలు, మున్సిపల్ కార్మికులను కోరుకుంటున్నాం 
  • సమ్మె కొనసాగిస్తే నోటీసులు ఇస్తాం
  • తర్వాత ఏం స్టెప్ తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement