'గ్లాస్‌ గుచ్చుకుంది'..! | Sakshi
Sakshi News home page

'గ్లాస్‌ గుచ్చుకుంది'..!

Published Thu, May 9 2024 9:44 AM

AP Election Argument Between BJP Candidate Vishnu Kumar Raju And VV Lakshmi Narayana

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్‌రాజుకు గ్లాసు గుర్తు గట్టిగానే గుచ్చుకుంటోందట. ఇప్పటికే జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తన ఓట్లనే చీల్చుతారని తెగ ఇదైపోతున్నారట. దీనికి గ్లాసు గుర్తు తోడు కావడంతో భయపడ్డ ఆయన, గ్లాస్‌ గుర్తు దక్కిన స్వతంత్ర అభ్యర్థి ఇంటికెళ్లి మరీ బతిమాలుకున్నారట.

తను గెలిచాక అధిక మొత్తం ముట్టజెప్తానని హామీ ఇచ్చారట. అయి తే 2014లో ఆయన తీరు గుర్తుకొచ్చి తక్షణ బేరం మాట్లాడుకున్నారట. కాస్త ‘భారీ’స్థాయిలో బతిమాలుకున్నాకే ఆ అభ్యర్థి వెనక్కి తగ్గినట్లు పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి పరువు తప్ప, అధికారం మాత్రం దక్కదన్న నమ్మకానికొచ్చేశారట..!

ఇవి చదవండి: 'పులుసు కారుతోంది'..!

Advertisement
 
Advertisement
 
Advertisement