గుర్రం జాషువాకు సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు | AP CM YS Jagan Pays Tributes To Telugu Poet Gurram Jashuva | Sakshi
Sakshi News home page

గుర్రం జాషువాకు సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు

Sep 28 2021 2:13 PM | Updated on Sep 28 2021 6:24 PM

AP CM YS Jagan Pays Tributes To Telugu Poet Gurram Jashuva - Sakshi

సాక్షి,  తాడేపల్లి: నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘తన పదునైన కవిత్వం ద్వారా సమాజంలోని దురాచారాలను ప్రశ్నించి ఆలోచింపజేసిన కవి గుర్రం జాషువా గారు. అణగారిన ప్రజల ఆత్మగౌరవం కోసం పాటుబడిన నవయుగ కవి చక్రవర్తి ఆయన. తెలుగు వారికి ఎన్నో ఆణిముత్యాల్లాంటి రచనలను అందించిన జాషువా గారి జయంతి సందర్భంగా ఘన నివాళి’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

చదవండి: క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌

Advertisement
 
Advertisement
Advertisement