నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ | AP Cabinet Meeting Is On 5th November | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ

Nov 5 2020 5:16 AM | Updated on Nov 5 2020 5:16 AM

AP Cabinet Meeting Is On 5th November - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయం ఒకటో బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా చేసేందుకు ఇటీవల విడుదల చేసిన ప్రత్యేక పారిశ్రామిక విధానానికి (జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం పథకం) కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. అలాగే నూతన ఇసుక విధానంపై కేబినెట్‌ చర్చించనున్నట్లు అధికార వర్గాల సమాచారం. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి డీపీఆర్‌పై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.   

Advertisement
 
Advertisement
Advertisement