తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైళ్లు | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్ రైళ్లు

Published Sat, Mar 9 2024 9:29 PM

Another Two Vande Bharat Trains To Telugu States - Sakshi

సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ నెల 12న వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు మరో వందే భారత్ రైలు నడపనున్నారు. గురువారం మినహా మిగిలిన ఆరు రోజులు వందే భారత్‌ నడవనుంది. ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకి వందేభారత్( రైల్‌ నంబర్-20707) విశాఖ చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 11.20కి వందేభారత్ ( రైలు నంబర్-20708) సికింద్రాబాద్ చేరుకోనుంది.

ఇప్పటికే విశాఖ- సికింద్రాబాద్ మధ్య ఒక వందే భారత్‌ రైలు నడుస్తుంది. ప్రయాణికులు ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్- విశాఖ మధ్య మరొక వందేభారత్ రైలును కేటాయించారు.

విశాఖ- పూరి మధ్య ఈ నెల 12 నుంచి వందే భారత్ పరుగులు పెట్టనుంది. శనివారం మినహా మిగిలిన ఆరు రోజులలో పూరి- విశాఖ మధ్య వందేభారత్ నడవనుంది. పూరిలో ఉదయం 5.15 బయలుదేరి.. ఉదయం 11.30 గం.లకి విశాఖ చేరుకోనున్న వందేభారత్ ( రైలు నంబర్- 20841).. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 3.40కి బయలుదేరి రాత్రి 9.55 గంటలకి పూరి వందేభారత్ ( రైలు నంబర్- 20842) చేరుకోనుంది. కుర్దా రోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరంలో స్టాపేజ్‌లు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఇంగ్లిష్‌.. భవిత భేష్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement