విశాఖ సెంట్రల్ జైలులో మరో మొబైల్ కలకలం | Another Mobile Phone Found In Visakhapatnam Central Jail | Sakshi
Sakshi News home page

విశాఖ సెంట్రల్ జైలులో మరో మొబైల్ కలకలం

Jan 3 2025 3:22 PM | Updated on Jan 3 2025 5:52 PM

Another Mobile Phone Found In Visakhapatnam Central Jail

సాక్షి, విశాఖపట్నం: విశాఖ సెంట్రల్ జైలులో మరో మొబైల్ కలకలం రేగింది. నర్మదా బ్లాక్‌లో మరో మొబైల్‌ను అధికారులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితం మూడు సెల్ ఫోన్లను అధికారులు గుర్తించారు. సిమ్ కార్డులేని మొబైల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూపరింటెండెంట్ మహేష్ బాబు నేతృత్వంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

విశాఖ సెంట్రల్ జైలులో సెల్‌ ఫోన్లు దొరకడం సంచలనంగా మారింది. జైలు అధికారులు రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా డిసెంబరు 31న  పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు సెల్‌ ఫోన్స్‌ దొరికాయి. బ్యారక్‌ సమీపంలోని పూల కుండీ వద్ద భూమిలో నాలుగు అడుగల లోతున ఫోన్లను పాతిపెట్టారు. ఫోన్లను ప్యాక్‌ చేసి గుంతలో దాచిపెట్టారు. రెండు రాళ్లు కప్పి పైన పూల కుండీ పెట్టారు.

ఆ కవర్‌లో రెండు సెల్‌ఫోన్లు, ఒక పవర్‌ బ్యాంక్, రెండు చార్జింగ్‌ వైర్లు, ఫోన్ బ్యాటరీ కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక, దొరికిన సెల్‌ఫోన్లలో సిమ్ కార్డులు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, కవర్ దొరికిన పెన్నా బ్యారక్‌లో రౌడీ షీటర్ హేమంత్ కుమార్, ఇతర ఖైదీలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

జైల్లో మరో సెల్ఫోన్ గుర్తించిన అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement