AP: బంగాళాఖాతంలో అల్పపీడనం | Another cyclone threatens the state | Sakshi
Sakshi News home page

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం

Nov 14 2026 4:49 AM | Updated on Nov 14 2026 4:49 AM

Another cyclone threatens the state

వాయుగుండంగా బలపడే అవకాశం  

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మరో తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిన ఈ వ్యవస్థ వాయవ్య దిశగా కదులుతోంది. రాబోయే 24 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారి ఆదివారం వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నివారణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ)అధికారులు పేర్కొన్నారు. ఆ తరువాత ఇది తుపానుగా మారి దక్షిణ కోస్తాంధ్ర, లేదా ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుత వాతావరణం చల్లగా ఉండడంతో ఇది భూమి మీదకు రాకుండా సముద్రంలోనే బలహీనపడే అవకాశాలు కూడా లేకపోలేదని భావిస్తున్నారు. దీని ప్రభావం కాకినాడ నుంచి విశాఖపట్నం మధ్య ఉండవచ్చు. ఆదివారం నుంచి ఆయా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సముద్రం కూడా అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement