ఆ వదంతులు నమ్మొద్దు: అదీప్ రాజ్ | Annamreddy Adeep Raj Respond On Rumors About His Health | Sakshi
Sakshi News home page

ఆ వదంతులు నమ్మొద్దు: అదీప్ రాజ్

Published Mon, Jun 24 2024 4:01 PM | Last Updated on Mon, Jun 24 2024 4:45 PM

Annamreddy Adeep Raj Respond On Rumors About His Health

సాక్షి, విశాఖపట్నం: తాను ఆత్మహత్య చేసుకున్నానంటూ వచ్చిన వదంతులను నమ్మొద్దని పెందుర్తి వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్ పేర్కొన్నారు. తాను ఆత్మహత్య చేసుకున్నట్టు సోషల్‌ మీడియాలో వస్తున్న ఊహాగానాలపై అదీప్ రాజ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారు

ఆదివారం సాయంత్రం నేతలతో సమావేశం అనంతరం గ్యాస్టిక్ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యానని, రేపటి నుంచి కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement