రెండో విడత 246 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు | Andhra Pradesh panchayat polls phase 2 on November 29 | Sakshi
Sakshi News home page

రెండో విడత 246 మండలాల్లో పంచాయతీ ఎన్నికలు

Nov 17 2026 5:06 AM | Updated on Nov 17 2026 5:06 AM

Andhra Pradesh panchayat polls phase 2 on November 29

4,970 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ 

రేపటి నుంచి నామినేషన్లు స్వీకరణ 

29న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 4,970 గ్రామ పంచాయతీల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠ సోమవారం నోటిఫికేషన్‌ జారీ  చేశారు. ఆ పంచాయతీల్లో 4,970 సర్పంచి పదవులతో పాటు 49,274 వార్డులకు బుధవారం పంచాయతీల వారీగా రిటరి్నంగ్‌ అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేసి, అనంతరం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఈ నెల 29వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరుగుతుందని, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. రెండో విడతలో కేవలం నాలుగు మండలాలే ఉన్న విశాఖపట్నం జిల్లా మినహా మిగిలిన 27 జిల్లాల్లోని 246 మండలాల్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లాలో అత్యధికంగా 19 మండలాల్లో, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నాలుగేసి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలి విడత ఎన్నికలకు ఆదివారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. రెండో విడత ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. మిగిలిన 212 మండలాల పరిధిలోని పంచాయతీలకు ఈ నెల 21న నోటిఫికేషన్‌ జారీ కానుంది.

రెండో దశ  ఎన్నికల షెడ్యూల్
⇒ ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు: నామినేషన్ల స్వీకరణ 
⇒ 21వ తేదీ : ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన 
⇒ 22వ తేదీ: సాయంత్రం 5 గంటల వరకు తిరస్కరించిన నామినేషన్లపై అప్పీళ్లకు అవకాశం 
⇒  23వ తేదీ: అప్పీళ్ల పరిష్కారం 

⇒ 24వ తేదీ: మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటన 
⇒ 29వ తేదీ: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన, ఉపసర్పంచ్‌ల ఎన్నిక 
⇒ నవంబర్‌ 30: అవసరమైన ప్రాంతాల్లో రీపోలింగ్, అనంతరం ఫలితాల ప్రకటన   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement