
సాక్షి, అమరాతి: సినిమా టికెట్ల ధరలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పాత పద్ధతిలోనే టికెట్ల రేట్లు పెంచుకోవచ్చంటూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు నిలుపుదల చేసింది.