సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సెప్టెంబర్ 4, తెల్లవారుజాము 2.55 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–17 రాకెట్ ద్వారా 1,117 కిలోల ఈవోఎస్–05 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మూడు దశల రాకెట్ అనుసంధానం పనులను పూర్తిచేసి, అన్ని రకాల పరీక్షలు నిర్వహించి శుక్రవారం ప్రయోగ వేదిక మీదకు తరలించారు. రిహార్సల్స్ నిర్వహించాక కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 1న ఎంఆర్‌ఆర్ సమావేశం జరగవచ్చు.


