Minister Ambati Rambabu: మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు

Ambati Rambabu Take Charge As Minister Of Water Resources - Sakshi

సాక్షి, అమరావతి: జల వనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని నాలుగవ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రిగా అవకాశం ఇవ్వడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన జలయజ్ణాన్ని పూర్తి చేస్తానని తెలిపారు. ఏపీలో అన్ని‌ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి రైతులకి నీరందించడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి  అండగా ఉంటానన్నారు.

చదవండి: వ్యవసాయ మంత్రిగా కాకాణి బాధ్యతలు.. తొలి రెండు సంతకాలు వాటిపైనే..

‘‘పోలవరం చాలా కీలక ప్రాజెక్ట్‌.. ఏపీకి వరం. పోలవరంతో రైతులందరికీ మేలు జరుగుతుంది. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తా. పోలవరంపై అడ్డంకులను అధిగమిస్తాం. పోలవరంపై రీడిజైనింగ్ చేయడానికి‌ పరిస్థితులు ఎందుకు వచ్చాయి. డయా ఫ్రమ్ దెబ్బతిన్న సందర్బాలు ఏ ప్రాజెక్ట్‌లోనూ లేవు. గత ప్రభుత్వ తప్పిదాలే కారణం. డయా ఫ్రమ్‌తో ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయడానికి  2100 కోట్ల అంచనా అవుతుందని నిపుణులు అంటున్నారు. పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది. చంద్రబాబు తప్పిదాలే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం. స్పిల్ వే పూర్తి కాకుండా డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం హడావుడిగా పూర్తి చేసి బిల్లులు డ్రా చేసేశారు. చంద్రబాబు ధన దాహం వల్ల.. పోలవరాన్ని డబ్బు కోసం ఉపయోగించడం వల్లే ఈ దుస్ధితి. గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దేవినేని ఉమా కూడా దీనికి ‌కారణం. చంద్రబాబు, ఉమలు ఈ జాతికి సమాధానం చెప్పాలని’’ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు.


అంబటి రాంబాబు రాజకీయ నేపథ్యం:
కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌గా పనిచేశారు. జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1989లో రేపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున సత్తెనపల్లి నుంచి పోటీచేసి ఓటమిపాలైన ఆయన 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top