breaking news
Water Resources Minister
-
మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు
సాక్షి, అమరావతి: జల వనరుల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని నాలుగవ బ్లాక్‌లోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రిగా అవకాశం ఇవ్వడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు. దివంగత వైఎస్సార్ హయాంలో ప్రారంభమైన జలయజ్ణాన్ని పూర్తి చేస్తానని తెలిపారు. ఏపీలో అన్ని ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి రైతులకి నీరందించడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా ఉంటానన్నారు. చదవండి: వ్యవసాయ మంత్రిగా కాకాణి బాధ్యతలు.. తొలి రెండు సంతకాలు వాటిపైనే.. ‘‘పోలవరం చాలా కీలక ప్రాజెక్ట్.. ఏపీకి వరం. పోలవరంతో రైతులందరికీ మేలు జరుగుతుంది. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తా. పోలవరంపై అడ్డంకులను అధిగమిస్తాం. పోలవరంపై రీడిజైనింగ్ చేయడానికి పరిస్థితులు ఎందుకు వచ్చాయి. డయా ఫ్రమ్ దెబ్బతిన్న సందర్బాలు ఏ ప్రాజెక్ట్‌లోనూ లేవు. గత ప్రభుత్వ తప్పిదాలే కారణం. డయా ఫ్రమ్‌తో ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేయడానికి 2100 కోట్ల అంచనా అవుతుందని నిపుణులు అంటున్నారు. పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉంది. చంద్రబాబు తప్పిదాలే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం. స్పిల్ వే పూర్తి కాకుండా డయా ఫ్రమ్ వాల్ నిర్మాణం హడావుడిగా పూర్తి చేసి బిల్లులు డ్రా చేసేశారు. చంద్రబాబు ధన దాహం వల్ల.. పోలవరాన్ని డబ్బు కోసం ఉపయోగించడం వల్లే ఈ దుస్ధితి. గత ప్రభుత్వంలో మంత్రిగా చేసిన దేవినేని ఉమా కూడా దీనికి కారణం. చంద్రబాబు, ఉమలు ఈ జాతికి సమాధానం చెప్పాలని’’ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు రాజకీయ నేపథ్యం: కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్‌గా పనిచేశారు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1989లో రేపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున సత్తెనపల్లి నుంచి పోటీచేసి ఓటమిపాలైన ఆయన 2019లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
పెన్నా బ్యారేజ్ పనులను పరిశీలించిన మంత్రి అనిల్‌కుమార్
సాక్షి, నెల్లూరు : నెల్లూరులోని పెన్నా బ్యారేజ్ పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ ..వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ర్లంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. దివంగత నేత డాక్టర్ వై.ఎస్.ఆర్ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను ఎన్ని అడ్డంకులు ఎదురైనా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరూ బ్యారేజ్ పనులను వీలైనంత తొందరగా పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. -
ఇంకా పట్టిసీమలోనే..
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా తీసుకొచ్చిన హంద్రీనీవా పాత మోటారు ఇంకా పట్టిసీమలోనే ఉంది. ఈనెల 18న హడావుడిగా పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించేందుకు ఈ మోటారును హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన 24 గంటల్లోనే జానంపేట వద్ద అక్విడెక్ట్‌కు గండి పడటంతో గోదావరి నుంచి నీటి తోడకాన్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం 6వ నంబర్ వెల్‌కు బిగించిన హంద్రీనీవా పాత మోటారును తొలగించారు. దీని స్థానంలో చైనానుంచి తెచ్చిన మోటారును చైనా ఇంజినీర్లు బిగిస్తున్నారు. పాత మోటారును హంద్రీనీవాకు తరలిస్తామని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించినా.. దానిని అక్కడికి తీసుకెళ్లలేదు.