గుంటూరులో జాషువా కళా ప్రాంగణం నిర్మిస్తున్నాం: మంత్రి సురేష్ | Adimulapu Suresh Says Constructing Jashuva Kala Pranganam In Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో జాషువా కళా ప్రాంగణం నిర్మిస్తున్నాం: మంత్రి సురేష్

Jul 24 2021 11:25 AM | Updated on Jul 24 2021 11:27 AM

Adimulapu Suresh Says Constructing Jashuva Kala Pranganam In Guntur - Sakshi

మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, గుంటూరు: తెలుగు భాషాభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరులో జాషువా కళా ప్రాంగణం నిర్మిస్తున్నామని తెలిపారు. జాషువా నివసించిన ఇంటిని స్మారక భవనంగా మార్చాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్తామని పేర్కొన్నారు. ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టినప్పటికీ తెలుగు భాషా ఔన్నత్యాన్ని కాపాడతామని తెలిపారు. తెలుగు అకాడమీ ద్వారా జాషువా కవితలపై పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తామని ఆయన వెల్లడించారు. మూఢ నమ్మకాలు, సామాజిక రుగ్మతులపై జాషువా రచనలు ప్రభావం చూపాయని గుర్తుచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement