
విజయవాడ: ఆరోగ్య శ్రీ సేవల యథాతధంగా కొనసాగుతాయని ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ స్సష్టం చేసింది. పేషెంట్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రేపటి నుంచి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగుతాయని ఆరోగ్య శ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) రూ. 368 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించినట్లు ఆయన తెలిపారు.